Andrew Symonds: బిగ్‌బాస్‌లో క్రికెట్ దిగ్గజం.. పాత వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-05-16T20:01:19+05:30 IST

క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మే 15న ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు...

Andrew Symonds: బిగ్‌బాస్‌లో క్రికెట్ దిగ్గజం.. పాత వీడియో వైరల్

క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ మే 15న ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. టౌన్స్‌విల్లేకు 50 కిలోమీటర్ల దూరంలోని హెర్వీ రేంజ్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో విషాదాన్ని నింపింది. ఈ తరుణంలో సైమండ్స్ గతంలో టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో పాల్గొన్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఈ క్రికెటర్ మున్నాభాయ్ ఎంబీబీఎస్‌ (MunnaBhai MBBS)‌లోని సంజయ్ దత్ పాత్రని, అలాగే షోలే అమ్జాద్ ఖాన్ పోషించిన గబ్బర్ సింగ్ పాత్రని ఇమిటేట్ చేశాడు.


ఆండ్రూ సైమండ్స్ 2011లో బిగ్‌బాస్ 5లో ప్రత్యేక అతిథిగా రెండు వారాల పాటు హౌస్‌లో ఉన్నాడు. ఈ సందర్భంలో ఓ ఎపిసోడ్‌లో ఆయన మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లోని సంజయ్ పాత్ర అనుకరించాడు. అందులో ఆకాష్‌దీప్ సైగల్ అర్షద్ వార్సీ పాత్ర సర్క్యూట్‌‌గా నటించాడు. అలాగే సన్నీ లియోన్ నుంచి డ్యాన్స్ సైతం నేర్చుకున్నాడు. అనంతరం ఓ సాంగ్‌కు డ్యాన్స్ కూడా చేశాడు.




అదే షో మరొక ఎపిసోడ్‌లో.. ఆండ్రూ సైమండ్స్ షోలే(Sholay)లోని గబ్బర్ సింగ్‌గా పాత్రని అనుకరించాడు. ఇందులో కాలియా పాత్రలో జూహీ నటించింది. ఈ క్రికెటర్ పర్ఫెక్ట్‌ డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకోవడం విశేషం. అలాగే అక్కడ ఉన్నప్పుడు రోటీ, భారతీయ వంటకాలు, కూరలు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఈ వీడియోని చూసిన పలువురు సైమండ్స్ అభిమానులు బాధగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-05-16T20:01:19+05:30 IST