Oke oka jeevitham: విడుదలకు ముందు నో.. తర్వాత యస్..

Twitter IconWatsapp IconFacebook Icon
Oke oka jeevitham: విడుదలకు ముందు నో.. తర్వాత యస్..

శర్వానంద్‌ (Sharwanand) హీరోగా నటించిన సినిమా ‘ఒకే ఒక జీవితం’ (Oke oka jeevitham). శ్రీ కార్తిక్ (Shree Karthick) దర్శకత్వం వహించాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటించింది. అక్కినేని అమల, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల అయింది. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. అయితే, ఈ మూవీ రిలీజ్‌కు ముందు శాటిలైట్, ఓటీటీ రైట్స్‌ను ఎవరు కొనుగోలు చేయలేదు. కానీ, సినిమా విడుదల కాగానే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. శాటి‌లైట్ రైట్స్‌ను కొనడానికి ఓ ప్రముఖ ఛానల్ మేకర్స్‌తో సంప్రదింపులు జరుపుతుంది. 


ఒకే ఒక జీవితం సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. కానీ, సరైన రిలీజ్ డేట్ కోసం మేకర్స్ వేచి చూశారు. అనేక వాయిదాల అనంతరం చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేశారు. ఈ మూవీ విడుదలకు ముందు శర్వాకు వరుసగా ప్లాఫ్‌లు వచ్చాయి. అందువల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సరిగ్గా జరగలేదు. శాటిలైట్, ఓటీటీ రైట్స్‌ను ఎవరు కొనుగోలు చేయలేదు. సినిమా విడుదల కాగానే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. విమర్శకులందరు పాజిటివ్ రివ్యూస్‌ను ఇచ్చారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లీవ్ (Sonyliv) డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. త్వరలోనే సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్‌ను కొనుగోలు చేయడానికి పలు ఛానల్స్ ఆసక్తి చూపిస్తున్నాయట. మేకర్స్ ముందుగా ఓ ఛానల్‌తో చర్చలు జరపగా అవి విఫలం అయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం మరో ఛానల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే, ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో చేయలేదు. అందువల్ల మూవీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.     


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.