Rashmirekha Ojha: పాపం ఈ టీవీ నటి.. ఎందుకింత పనిచేసిందో..

ABN , First Publish Date - 2022-06-21T02:56:57+05:30 IST

ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. పాపులర్ ఒడియా టీవీ నటి రష్మీరేఖ ఓజా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి..

Rashmirekha Ojha: పాపం ఈ టీవీ నటి.. ఎందుకింత పనిచేసిందో..

భువనేశ్వర్: ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. పాపులర్ ఒడియా టీవీ నటి రష్మీరేఖ ఓజా (Rashmirekha Ojha) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని (bhubaneswar) గదసాహీ (gadasahi) ప్రాంతానికి సమీపంలోని నాయపల్లి ప్రాంతంలో రష్మీరేఖ ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆ ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. గది లోపల లాక్ చేసి ఉండటంతో తలుపులు బద్ధలు కొట్టి ఉరికి వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని కిందకు దించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆమె కొన్నాళ్లుగా ఒక వ్యక్తితో సహ జీవనం చేస్తోందని.. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అతనే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రష్మీ రేఖ తండ్రి కూడా అతనిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Updated Date - 2022-06-21T02:56:57+05:30 IST