ఓ ముసలమ్మ పరుగు పందెం

ABN , First Publish Date - 2022-05-17T05:45:17+05:30 IST

‘లతా భగవాన్‌ కరే..’.. మరాఠీలో రూపొందిన చిన్న సినిమా ఇది. 65 ఏళ్ల ఓ వృద్ధ మహిళ, తన భర్త ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు పరుగుపందెంలో పాల్గొని...

ఓ ముసలమ్మ పరుగు పందెం

‘లతా భగవాన్‌ కరే..’.. మరాఠీలో రూపొందిన చిన్న సినిమా ఇది. 65 ఏళ్ల ఓ వృద్ధ మహిళ, తన భర్త ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు పరుగుపందెంలో పాల్గొని, గెలుస్తుంది. ఇది నిజంగా జరిగిన కథ. నటీనటులంతా తమ నిజ జీవిత పాత్రలనే పోషించడం విశేషం. అందుకే ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. 70 దేశాల్లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరాఠీ పాఠ్య పుస్తకాల్లో ఈ కథని పాఠంగా చేర్చారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నవీన్‌, నిర్మించిన కృష్ణ ఇద్దరూ తెలుగువాళ్లే.  ఇప్పుడు ఈ చిత్రాన్ని మిగిలి భాషల్లోనూ రూపొందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం.ఎల్‌.ఏ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఆదర్శవంతమైన మహిళ కథ ఇది. ఇలాంటి స్ఫూర్తివంతమైన చిత్రాలు ప్రతి భాషలోనూ రావాలి. ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించాల’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రానికి ఇంత గొప్ప స్పందన రావడం సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ కథని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. మరో వినూత్నమైన కథని కూడా సిద్ధం చేశా. త్వరలోనే వాటి వివరాలు చెబుతా’’ అన్నారు. 

Updated Date - 2022-05-17T05:45:17+05:30 IST