NTR: కాలర్‌ ఎగరేసే సినిమాలు చేస్తాం!

ABN , First Publish Date - 2022-07-29T05:30:00+05:30 IST

‘‘రెండున్నరేళ్ల క్రితం కల్యాణ్‌ అన్న ఫోన్‌ చేసి ఆసక్తికర కథ విన్నానని చెప్పాడు. ఓసారి నన్నూ వినమన్నాడు. ఈ చిత్ర దర్శకుడితో నాకు పరిచయం ఉంది. తనను వేణు అని పిలుస్తాను. ఇదీ పాయింట్‌ అని నాకు పూర్తిగా వివరించాడు. అయితే ‘దర్శకత్వంలో అనుభవం లేదు. ఇంత పెద్ద స్పాన్‌ ఉన్న కథను డీల్‌ చేయగలడా, లేదా?’ అని నేను భయపడ్డా. ఈ మధ్యనే కాపీ చూశాక నాకు ఆ సందేహం పోయింది’’ అని జూ.ఎన్టీఆర్‌ అన్నారు.

NTR: కాలర్‌ ఎగరేసే సినిమాలు చేస్తాం!

పెద్ద స్పాన్‌ ఉన్న కథ ఇది..

దర్శకుడు డీల్‌ చేయగలడా? అనే అనుమానం ఉండేది

కాపీ చూశాక.. ఆ భయం పోయింది.. 

పరిశ్రమకు గడ్డు కాలం అంటే నమ్మను..

పరిశ్రమకు కొత్త ఊపిరిపోయాలి

– ‘బింబిసార’ ప్రీ రిలీజ్‌ వేదికపై తారక్‌(NTR speech)

‘‘రెండున్నరేళ్ల క్రితం కల్యాణ్‌ (Kalyan ram)అన్న ఫోన్‌ చేసి ఆసక్తికర కథ విన్నానని చెప్పాడు. ఓసారి నన్నూ వినమన్నాడు. ఈ చిత్ర దర్శకుడితో నాకు పరిచయం ఉంది. తనను వేణు అని పిలుస్తాను. ఇదీ పాయింట్‌ అని నాకు పూర్తిగా వివరించాడు. అయితే ‘దర్శకత్వంలో అనుభవం లేదు. ఇంత పెద్ద స్పాన్‌ ఉన్న కథను డీల్‌ చేయగలడా, లేదా?’ అని నేను భయపడ్డా. ఈ మధ్యనే కాపీ చూశాక నాకు ఆ సందేహం పోయింది’’ అని జూ.ఎన్టీఆర్‌ (Jr ntr) అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘బింబిసార’(BIMBISARA) ప్రీ పిలీజ్‌ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తారక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వశిష్ఠ (Vasista)కథ ఎంత బాగా చెప్పాడో అంతే అద్భుతంగా తెరకెక్కించాడు. కథ, కథనం ఎలా ఉన్నాయో తెలిసిన నేనే అవుట్‌పుట్‌ చూసి థ్రిల్‌ అయ్యా. థియేటర్‌లో ప్రేక్షకులు అంతే థ్రిల్‌ అవుతారు. దర్శకుడి ప్రతిభకు టీజర్‌ ఒక నిదర్శనం. కీరవాణి అందించిన సంగీతం ‘ఈ చిత్రానికి  వెన్నెముక’’ అని అన్నారు. (Bimbisara pre release event)


ఈ సినిమాకు ముందు.. ఆ తర్వాత...

‘‘ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చేంత వరకూ సినిమాలు చేస్తూనే ఉంటాం. మీరు కాలర్‌ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత’ అని గతంలో చెప్పా. అన్నయ్య నటించిన ఈ సినిమా విషయంలోనూ అదే చెబుతున్నా.. అదే జరుగుతుంది కూడా! కల్యాణ్‌ అన్న సినీ కెరీర్‌ను గుర్తు చేసుకుంటే ‘బింబిసార’కు ముందు బింబిసార’ తర్వాత అనాల్సిందే. ఈ చిత్రం కోసం రక్తాన్ని ధారపోసి నటుడిగా తనని తాను మలుచుకున్నాడాయన. ఈ పాత్రను ఆయన తప్ప ఎవరూ చేయలేరు".

కొత్త ఊపిరిపోయాలి: తారక్‌

‘‘ప్రస్తుతం సినిమా పరిశ్రమకు గడ్డు కాలం నడుస్తుందని, ప్రేక్షకులు థియేటర్లకి రావట్లేదు’ అనంటున్నారు. దీనిని నేను నమ్మను. అద్భుతమైన సినిమా  వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప మనసుంది తెలుగు ప్రేక్షకులకి. ఈ సినిమాతోపాటు విడుదల కాబోతున్న ‘సీతారామం’ సినిమాను కూడా ఆదరించి, మన పరిశ్రమకు కొత్త ఊపిరిపోయాలి’’. 

తాతకి అంకితం: కల్యాణ్‌ రామ్‌

‘‘మనందరికీ చందమామ కథలు, జానపద సినిమాలంటే ఇష్టం. అలాంటి చిత్రాలకు తాతయ్య (ఎన్టీఆర్‌) పునాది వేశారు. ఆయన నటించిన ‘పాతాళ భైరవి’, బాలకృష్ణ బాబాయ్‌ నటించిన ‘భైరవద్వీపం’, చిరంజీవి గారి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఇలా ఎన్నో చిత్రాలు మన ముందుకొచ్చాయి. అలాంటి నేపథ్యంలోనే మేం చేసిన  ఓ ప్రయత్నమే ‘బింబిసార’. ఈ చిత్రాన్ని తాతకు అంకితం చేస్తున్నా. ఈ సారి ఎవరినీ నిరుత్సాహపరచనని మాటిస్తున్నా. ఈ చిత్రం చూసి అందరూ గర్వంగా ఫీలవుతారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను నాకిచ్చిన నిర్మాత హరికి రుణపడి ఉంటా. కీరవాణి సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు.’’ అని కల్యాణ్‌రామ్‌ అన్నారు.

సంయుక్తా మీనన్‌, కేథరిన్‌ ప్రకాశ్‌రాజ్‌, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ  చిత్రానికి వశిష్ఠ దర్శకుడు. ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. (Bimbisara on 5th august)


Updated Date - 2022-07-29T05:30:00+05:30 IST