NTR - Shankar: మూవీ సెట్టవ్వాలంటే..!

ABN , First Publish Date - 2022-05-15T18:29:29+05:30 IST

ఆర్‌ఆర్‌ఆర్ (RRR) రిలీజ్ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) క్రేజ్ పాన్‌ ఇండియా లెవల్‌కు చేరుకుంది. ఆయన, అన్నిసినిమాలను భారీ స్థాయిలోనే ప్లాన్‌ చేసుకుంటున్నారు.

NTR - Shankar: మూవీ సెట్టవ్వాలంటే..!

ఆర్‌ఆర్‌ఆర్ (RRR) రిలీజ్ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) క్రేజ్ పాన్‌ ఇండియా లెవల్‌కు చేరుకుంది. ఆయన, అన్నిసినిమాలను భారీ స్థాయిలోనే ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ ఒక సెన్సేషనల్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారు.. అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కోసమే దాదాపు నాలుగేళ్లు త్యాగం చేశారు తారక్‌ (Tarak). నాలుగు సంవత్సరాలు ఒక్క సినిమాకి కేటాయించిన ఆయన, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేసి ఆ గ్యాప్‌ను బర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva)తో తన 30వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది. 'ఉప్పెన' ఫేమ్‌ బుచ్చిబాబుతో కూడా తారక్ ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)తో ఓ సినిమా చేయనున్నారు. 


అయితే, పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ రావడానికి ముందే పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అనే ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఏకైక దర్శకుడు శంకర్‌. భారీ చిత్రాలకు, విజువల్‌ వండర్స్‌కి ఆయన పెట్టింది పేరు. శంకర్‌ (Shankar)తో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్నారనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్‌ టాక్‌. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. శంకర్‌ ఇప్పుడు రామ్‌చరణ్‌ (Ram Charan)తో 'RC15' సినిమా చేస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.


ఈ సినిమా తర్వాత శంకర్‌.. హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో 'అపరిచితుడు 2' చేయబోతున్నారు. ఈ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేసారు. ఈ రెండు సినిమాలని శంకర్ కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎన్టీఆర్‌కు కూడా కొరటాల, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ ల సినిమాలను కంప్లీట్ చేయాలంటే ఎంత లేదన్నా మూడేళ్ళు పడుతుంది. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్, శంకర్ కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించట్లేదు.

Updated Date - 2022-05-15T18:29:29+05:30 IST