RRR : ఆస్కార్‌ బరిలో తారక్‌?

ABN , First Publish Date - 2022-08-14T02:52:40+05:30 IST

జూ.ఎన్టీఆర్‌ ఆస్కార్‌ బరిలో ఉన్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు అనడం అతిశయోక్తి కాదు. కొమురం భీమ్‌ పాత్రలో ఆయన నటన ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇప్పుడు ఆయన ఆస్కార్‌ అవార్డ్‌ రేసులో ఉన్నారని తెలుస్తోంది.

RRR : ఆస్కార్‌ బరిలో తారక్‌?

జూ.ఎన్టీఆర్‌ (NTR)ఆస్కార్‌ బరిలో ఉన్నారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రంలో తారక్‌ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు అనడం అతిశయోక్తి కాదు. కొమురం భీమ్‌ (komuram bheem)పాత్రలో ఆయన నటన ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇప్పుడు ఆయన ఆస్కార్‌ అవార్డ్‌ రేసులో ఉన్నారని తెలుస్తోంది. అమెరికాలో పేరొందిన మూవీ పబ్లికేషన్‌ variety ఎడిషన్‌ 2023 ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఎన్టీఆర్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆస్కార్‌ బరిలో ఉన్న హీరో తొలి హీరో ఎన్టీఆర్‌ అవుతారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-08-14T02:52:40+05:30 IST