Ntr Fans: అభిమానం పేరుతో హద్దు మీరుతున్నారు!

ABN , First Publish Date - 2022-08-02T18:25:28+05:30 IST

స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ అభిమానం పరాకాష్టకు చేరుతుంది. అభిమాన హీరో సినిమా విడుదలవుతుందీ అంటే థియేటర్ల దగ్గర హీరోల కటౌట్‌లకు నెత్తుటి తిలకం దిద్ది, పాలాభిషేకాలు చేస్తూ నిలువెత్తు గజమాలల అలంకారాలతో హంగామా చేస్తుంటారు. ఇది ఒక్కప్పుడు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది.

Ntr Fans: అభిమానం పేరుతో హద్దు మీరుతున్నారు!

స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ అభిమానం పరాకాష్టకు చేరుతుంది. అభిమాన హీరో సినిమా విడుదలవుతుందీ అంటే థియేటర్ల దగ్గర హీరోల కటౌట్‌లకు నెత్తుటి తిలకం దిద్ది, పాలాభిషేకాలు చేస్తూ నిలువెత్తు గజమాలల అలంకారాలతో హంగామా చేస్తుంటారు. ఇది ఒక్కప్పుడు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సినిమా ప్రమోషన్స్‌లో వింత పోకడలు చూపిస్తునట్లే.. ఫ్యాన్స్‌ అభిమానం కూడా అప్‌డేట్‌ అయింది. మితిమీరిన అభిమానం ఫీట్స్‌ చేయిస్తుంది. క్రేన్‌లతో హీరోలకు గజమాలలు వేయడంలాంటివి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. tollywood heros fans


తాజాగా ఎన్టీఆర్‌ అభిమానులు చేసిన ఫీట్లు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తమిళనాడులోని హోసూర్‌లో ఎన్టీఆర్‌ (Ntr fans craze)ఫ్యాన్‌ తమ అభిమాన హీరోపై ఉన్న ఎనలేని అభిమానాన్ని ఫీట్స్‌ చేస్తూ చూపించారు. ధ్వజస్తంభం కంటే ఎత్తైన హెవీ క్రేన్‌ హ్యాండిల్‌కు ఓ అరడజను మంది వేలాడుతూ కనిపించారు. విచిత్ర వేషధారణలో కేబుల్స్‌ సాయంతో పైకి, కిందికి కదులుతూ ఎన్టీఆర్‌ పోస్టర్‌ పట్టుకుని జేజేలు కొట్టారు. ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ పుష్ప వర్షం కురిపించారు. తమిళుల ఆరాధ్య దైవం మురుగన్‌కు సంబంధించిన ఓ ఉత్సవంలో అభిమానులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ  వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 


‘అభిమానాన్ని మనసులో ఉంచుకుంటే చాలు. ప్రమాదాలకు గురయ్యే పనులకు దూరంగా ఉండండి. జర అప్రమత్తం’ అని హీరోలు చెబుతున్నప్పటికీ ఫ్యాన్స్‌ మాత్రం ఆ విషయంలో మితివీరి ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసి కొందరు ఆనందిస్తుంటే.. కొందరు మాత్రం ఈ ఫీట్లు అవసరమా? ఇలాంటి ప్రయోగాలు చేస్తేనే అభిమానం ఉన్నట్లా? అని నెట్టింట చర్చలు జరుపుతున్నారు. అయితే ఇది ఒక్క ఎన్టీఆర్‌ అభిమానులను ఉద్దేశించే కాదు.. అందరు హీరోల అభిమానులు ఇలాగే ఉన్నారు. 




Updated Date - 2022-08-02T18:25:28+05:30 IST