ఓకే కథతో NTR, Puneeth Rajkumar సినిమాలు.. కానీ ఫలితం మాత్రం పూర్తి రివర్స్..!

ABN , First Publish Date - 2021-10-30T00:19:05+05:30 IST

పునీత్ రాజ్‌కుమార్ కన్నడ సూపర్ స్టార్ అయినా తెలుగు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా, మన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో శాండల్‌వుడ్‌ పవర్ స్టార్‌కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది...

ఓకే కథతో NTR, Puneeth Rajkumar సినిమాలు.. కానీ ఫలితం మాత్రం పూర్తి రివర్స్..!

పునీత్ రాజ్‌కుమార్ కన్నడ సూపర్ స్టార్ అయినా తెలుగు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా, మన డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో శాండల్‌వుడ్‌ పవర్ స్టార్‌కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. హీరోగా ఆయన తొలి చిత్రమే పూరీ రూపొందించాడు. ‘అప్పు’ సినిమాతో పునీత్ రాజ్‌కుమార్‌ను లాంచ్ చేసింది మన ‘ఇస్మార్ట్’ డైరెక్టరే. అయితే, కన్నడ స్టార్ హీరోకి మరో బ్లాక్ బస్టర్ కూడా పూరీ జగన్నాథే అందించాడు.


ఎన్టీఆర్ హీరోగా పూరీ తెరకెక్కించిన సినిమా ‘ఆంధ్రావాలా’. ఈ సినిమా టాలీవుడ్‌లో సంచలనం స‌ృష్టించలేకపోయింది. కానీ, సేమ్ స్టోరీతో ‘వీర కన్నడిగా’ అనే టైటిల్‌తో పునీత్ రాజ్‌కుమార్ కన్నడంలో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ‘వీర కన్నడి’గా డైరెక్టర్ మెహర్ రమేశ్. అంతకు ముందు ఆయన పూరీకి అసిస్టెంట్‌గా పని చేశాడు. పునీత్ ‘వీర కన్నడిగా’తో డైరెక్టర్ అయ్యాడు. శాండల్‌వుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది, ఈ చిత్రం...   

Updated Date - 2021-10-30T00:19:05+05:30 IST