యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ని మేకర్స్.. తారక్ (Tarak) పుట్టినరోజు (మే 20)ను పురస్కరించుకుని అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రం నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సమర్పణలో.. యువసుధ ఆర్ట్స్ (Yuvasudha Arts) పతాకంపై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar mikkilineni), హరికృష్ణ.కె (Harikrishna K) నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. తాజాగా చిత్రయూనిట్ ఓ గ్లింప్స్‌ని కూడా విడుదల చేసింది. ‘Fury of #NTR30’గా వచ్చిన ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ ఫేస్‌ని చూపించలేదు కానీ.. అతని పాత్రకు సంబంధించిన పవర్‌ని, అలాగే ఓ పవర్ ఫుల్ డైలాగ్‌ని వదిలారు. ఎన్టీఆర్ అభిమానులు ఊహించని ఈ మాస్ ట్రీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తాను ఉండకూడదని..
అప్పుడు భయానికి తెలియాలి.. తాను రావాల్సిన సమయం వచ్చిందని..
వస్తున్నా..’’ అంటూ యంగ్ టైగర్ ఇందులో చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థమవుతోంది. అలాగే అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) మ్యూజిక్, రత్నవేలు (Ratnavelu) సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్ (Sabu Cyril) ఆర్ట్ వర్క్, శ్రీకర్ ప్రసాద్ (Sreekar Prasad) ఎడిటింగ్ ఈ సినిమాకి హైలెట్‌గా ఉండబోతున్నాయనేలా.. గ్లింప్స్‌ని అదరగొట్టారు. మొత్తంగా.. మాస్ హీరో నుండి వచ్చిన ఈ మాస్ ట్రీట్.. ప్రేక్షకులని అలరిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజుకి సరైన ట్రీట్ వచ్చిందంటూ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. కాగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా తెలుపుతూ.. ఈ గ్లింప్స్‌ని కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేశారు.