NTR 30 : సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే.. !

ABN , First Publish Date - 2022-05-16T15:07:12+05:30 IST

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR).. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. దీంతో టాలీవుడ్ లో అతడి స్థాయి మరింతగా పెరిగింది. ప్రస్తుతం తారక్ తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. NTR 30గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు అన్న సంగతి తెలిసిందే.

NTR 30 : సెట్స్‌పైకి వెళ్ళేది ఎప్పుడంటే.. !

యంగ్ టైగర్ యన్టీఆర్ (NTR).. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. దీంతో టాలీవుడ్ లో అతడి స్థాయి మరింతగా పెరిగింది. ప్రస్తుతం తారక్ తదుపరి చిత్రం గురించి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. NTR 30గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. సామాజిక కథాంశాల్ని కమర్షియల్ కోణంలో ప్రెజెంట్ చేసి హిట్ కొట్టే ఈ దర్శకుడు NTR 30 కోసం ఒక అదిరిపోయే స్ర్కిప్ట్ రాసుకున్నాడట. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తో ‘ఆచార్య’ (Acharya) చిత్రం తీసి అభిమానుల్ని నిరాశపరిచిన కొరటాల.. NTR 30 విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ఈ సినిమాలో యన్టీఆర్ పాత్ర అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


నిజానికి NTR 30 చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జూలై నుంచి మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. యన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా షూటింగ్ గురించి అఫీయల్ ఇన్ఫర్మేషన్ రాబోతోంది. ఇందులోని తన పాత్ర కోసం డిఫరెంట్ గా మేకోవర్ అవుతున్నాడు తారక్. ఆ పాత్ర కోసం ఏకంగా 8 నుంచి 9 కిలోల వరకూ బరువు తగ్గాడు.  ‘టెంపర్, అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాల్లో సిక్స్ ప్యాక్ బాడీతో అభిమానుల్ని మెప్పించిన తారక్..  NTR 30 లో కూడా తన మజిల్ పవర్‌ను చూపించబోతున్నట్టు టాక్. 


ఇంతకు ముందు యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ (Janatha garrage) చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఆ మూవీ తర్వాత మరోసారి ఈ ఇద్దరూ జోడీ కడుతున్న అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి తమిళ యువ సంగీత తరంగం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి NTR 30 చిత్రం ఏ తరహా కథాంశంతో తెరకెక్కుతుందో చూడాలి. 

Updated Date - 2022-05-16T15:07:12+05:30 IST