NTR 30: అప్పుడే రిలీజ్ డేట్ లాక్ అయిందా..?

ABN , First Publish Date - 2022-06-16T14:57:45+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వీటిలో తన కెరీర్‌లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)తో ఒక బిగ్గెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌ను చేయబోతున్నారు తారక్ (Tarak).

NTR 30: అప్పుడే రిలీజ్ డేట్ లాక్ అయిందా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వీటిలో తన కెరీర్‌లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)తో ఒక బిగ్గెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌ను చేయబోతున్నారు తారక్ (Tarak). ఇటీవల ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకొని భారీగా మూవీపై హైప్ తీసొకొచ్చింది. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వస్తుందో..విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో.. అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అయితే, తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ 30 (NTR 30)కి చిత్రబృందం విడుదల తేదీని లాక్ చేసిందట. వచ్చే ఏడాది మేలో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారట. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ రోజు ముందుగానే అంటే 2023, మే 19న ఎన్టీఆర్ 30ని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని, అందుకుతగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్ ..బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇవ్వాలని కొరటాల బృందం ప్లాన్ చేస్తుందట.


అన్నీ అనుకున్నట్టుగా పూర్తవుతుంటే మాత్రం ఈ ఏడాది విజయదశమి పండుగకు ఎన్టీఆర్ 30 నుంచి టైటిల్ అనౌన్స్ చేస్తారని సమాచారం. కాగా, ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి కూడా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చి ప్రాజెక్ట్‌పై భారీగా అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమాను 2023, ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి తీసుకువస్తామని ఇదివరకే మేకర్ తెలిపారు. 

Updated Date - 2022-06-16T14:57:45+05:30 IST