NTR: కర్ణుడి కష్టాల్లో యంగ్ టైగర్

ABN , First Publish Date - 2022-07-29T02:34:09+05:30 IST

మహాభారతంలో కర్ణుడి (Karna) చావుకి వంద కారణాలు అంటారు. సరిగ్గా ఇదే మాట ఎన్టీఆర్ (NTR) చేయబోయే సినిమాకి కూడా సరిపోతుంది. కొమురం భీమ్‌గా ప్రపంచం మొత్తం తన పేరు వినబడేలా చేసిన ఎన్టీఆర్... తన నెక్స్ట్ సినిమా

NTR: కర్ణుడి కష్టాల్లో యంగ్ టైగర్

మహాభారతంలో కర్ణుడి (Karna) చావుకి వంద కారణాలు అంటారు. సరిగ్గా ఇదే మాట ఎన్టీఆర్ (NTR) చేయబోయే సినిమాకి కూడా సరిపోతుంది. కొమురం భీమ్‌గా ప్రపంచం మొత్తం తన పేరు వినబడేలా చేసిన ఎన్టీఆర్... తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ 30 (NTR30)ని కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్‌లో అనౌన్స్ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సెట్స్‌పై ఉండగానే అనౌన్స్ అయిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఆ సినిమా ప్రమోషన్స్ అయిపోగానే సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. కరోనా వచ్చి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డిలే అయ్యింది. దీంతో ఎన్టీఆర్ 30 వాయిదా పడింది. సరే ట్రిపుల్ ఆర్ విడుదలైంది కదా.. కొరటాల తెరకెక్కిస్తున్న ఆచార్య (Acharya) కూడా రిలీజ్ అయిపోతే... ఇక ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుందిలే అని నందమూరి ఫాన్స్ డిసైడ్ అయిపోయారు. కానీ కాలం మరో విధంగా ప్లాన్ చేసింది. 


‘ఆచార్య’ సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ రిజల్ట్‌ని సొంతం చేసుకుంది. ఈ రిజల్ట్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ 30 సినిమాపైనే అనుమానాలు తెచ్చే రేంజ్‌లో ఇంపాక్ట్ చూపించింది. సరేలే హిట్స్, ఫ్లాప్స్ ఇండస్ట్రీలో మాములే కదా అనుకునే టైంకి.. డిస్ట్రిబ్యూటర్లు కొరటాల పీక పట్టుకున్నారు. చేసేదేమీ లేక కొరటాల అందరికీ సెటిల్మెంట్ చేశాడు, ఈ గోలలో స్క్రిప్ట్ వర్క్ ఏం చేస్తాను అనుకున్నాడో ఏమో కానీ ఎన్టీఆర్ 30 డిలే అవుతూనే ఉంది. ఇక అన్ని సమస్యలు తీరిపోయాయి, సెటిల్మెంట్స్ కూడా చేసేశారు. ఎన్టీఆర్ 30 ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్ళిపోతుంది అనుకుంటే.. ఇప్పుడేకంగా టాలీవుడ్‌లో షూటింగ్సే ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. నిజంగానే షూటింగ్స్ ఆగిపోతే.. మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు కానీ.. ఇలా ఏదో ఒక కారణంతో ఎన్టీఆర్ 30 సినిమా మాత్రం డిలే అవుతూనే ఉంది. పాన్ ఇండియా క్రేజ్ సాధించుకున్న ఎన్టీఆర్, తన 30వ సినిమాని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకుని వెళ్తాడు.. ఆ సినిమాకి ఉన్న కర్ణుడి కష్టాలు ఎప్పుడు తీరతాయి అనేది కాలమే నిర్ణయించాలి.

Updated Date - 2022-07-29T02:34:09+05:30 IST