రాజసం..సౌందర్యం..

ABN , First Publish Date - 2022-06-05T17:47:53+05:30 IST

రాజసాన్ని చాటుతూ నటరత్న ఎన్టీ రామారావు, ఆయన సరసన వెలిగిపోతున్న భానుమతి. 4 డిసెంబర్‌ 1964న విడుదలైన ‘బొబ్బిలియుద్ధం’లోనిది

రాజసం..సౌందర్యం..

రాజసాన్ని చాటుతూ నటరత్న ఎన్టీ రామారావు, ఆయన సరసన వెలిగిపోతున్న భానుమతి. 4 డిసెంబర్‌ 1964న విడుదలైన ‘బొబ్బిలియుద్ధం’లోనిది ఈ స్టిల్‌. విజయనగరం నుంచి వచ్చిన సీతారామ్‌ నిర్మించిన ఈ చిత్రంలో రంగనాయుడిగా ఎన్టీఆర్‌, ఆయన సరసన మల్లమదేవిగా భానుమతి నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మల్లీశ్వరి’ గొప్ప మ్యూజికల్‌ హిట్‌ కావడంతో ఆ చిత్ర సంగీత దర్శకుడైన సాలూరి రాజేశ్వరరావునే ఈ చిత్రానికీ ఎన్నుకున్నారు దర్శక నిర్మాత. ఇందులో నందమూరి తారక రామారావు, భానుమతిలపై చిత్రీకరించిన ‘ఊయలలూగినదోయి మనసే’ పాట ఆ రోజుల్లో బాగా పాపులర్‌. ఈ పాటలో ఎన్టీఆర్‌ రూపంలోని రాజసమూ, భానుమతి గాత్రంలోని మాధుర్యమూ ‘నువ్వా నేనా’ అన్నట్లు పోటీపడ్డాయి. ఈ చిత్ర నిర్మాణానికి ఆ రోజుల్లో ఐదు లక్షల రూపాయల వ్యయం అయ్యింది. సినిమా విడుదలైన రెండువారాల్లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. విశేషమేమిటంటే తెలుగు నేలపై నడిచిన రెండు ప్రధాన యుద్ధాలు ‘పల్నాటియుద్ధం’, ‘బొబ్బిలియుద్ధం’ తెరకెక్కాయి. ఈ రెండు చిత్రాల్లోనూ ఎన్టీఆర్‌, భానుమతీ నాయికా నాయకులుగా నటించి చరిత్రలో నిలిచిపోయారు. 

- డా.కంపల్లె రవిచంద్రన్‌, 98487 20478

Updated Date - 2022-06-05T17:47:53+05:30 IST