North vs South: హృతిక్ రోషన్‌కు గట్టి పోటీనిస్తానంటున్న ప్రభాస్

ABN , First Publish Date - 2022-08-15T22:39:32+05:30 IST

‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ చిత్రం అనంతరం ఉత్తరాది ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ప్రభాస్ నుంచి ‘సాహో’, ‘రాధే శ్యాం’

North vs South: హృతిక్ రోషన్‌కు గట్టి పోటీనిస్తానంటున్న ప్రభాస్

‘బాహుబలి’ ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ మూవీ అనంతరం ప్రభాస్ నుంచి ‘సాహో’, ‘రాధే శ్యాం’ వంటి చిత్రాలు వచ్చిన అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా అతడు నటిస్తున్న చిత్రం ‘సలార్’ (Salaar). ప్రశాంత్ నీల్ ( Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ‘సలార్’ విడుదల తేదీని ప్రకటించారు. రిలీజ్ డేట్ ప్రకటించడంతోనే ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యాయి. అదే రోజు మరో బాలీవుడ్ సినిమా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు దెబ్బతినే ప్రమాదముందని వారు అభిప్రాయపడుతున్నారు. 


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘సలార్’ విడుదల తేదీని ప్రకటించారు. 2023, సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కానీ, అదే రోజు బాలీవుడ్ మూవీ ‘ఫైటర్’ ( Fighter) ను రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే తెలిపారు. ‘ఫైటర్’ లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాక్షన్ చిత్రాల నిపుణుడు సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహిస్తున్నాడు. వయాకాం స్టూడియోస్‌తో కలసి సిద్దార్థ్ ఆనంద్ నిర్మిస్తున్నాడు. ‘సలార్’ లో శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ వర్సెస్ సౌత్ అనే అంశంపై పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్న సందర్భంలో ఒకే రోజు బాలీవుడ్, సౌత్ సినిమాలు విడుదల కావడం చెప్పుకోదగ్గ విశేషమే. 





Updated Date - 2022-08-15T22:39:32+05:30 IST