ఇన్‌స్టాగ్రామ్ నుంచీ Nora Fatehi మాయం... మళ్లీ ప్రత్యక్షం!

ABN , First Publish Date - 2022-02-05T04:17:58+05:30 IST

డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ ‌కి కాస్సేపు షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండీ ఆమె ఇన్‌స్టా అకౌంట్ డీయాక్టివేట్ అయిపోయింది. నిజానికి ఆమె తన అకౌంట్‌ని పూర్తిగా డిలీట్ చేసుకుందేమోనని కూడా ఫ్యాన్స్ భావించారు...

ఇన్‌స్టాగ్రామ్ నుంచీ Nora Fatehi మాయం... మళ్లీ ప్రత్యక్షం!

డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్ ‌కి కాస్సేపు షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండీ ఆమె ఇన్‌స్టా అకౌంట్ డీయాక్టివేట్ అయిపోయింది. నిజానికి ఆమె తన అకౌంట్‌ని పూర్తిగా డిలీట్ చేసుకుందేమోనని కూడా ఫ్యాన్స్ భావించారు. నోరాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 37.6 మిలియన్ల భారీ సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారు. అంత మందితో దూసుకుపోతోన్న సొషల్ మీడియా క్వీన్ కొన్ని గంటల పాటూ ఆన్‌లైన్ నుంచీ మాయమైపోయింది!


నోరా ఫతేహీ ప్రస్తుతం దుబాయ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె అకౌంట్ డీయాక్టివేషన్‌కి ముందు ఒక సింహానికి స్వయంగా ఆహారం తినిపిస్తూ వ్యూయర్స్‌ని థ్రిల్ చేసింది. కానీ, ఆ తరువాత కాస్సేపటికే ‘సారీ దిస్ పేజ్ ఈజింట్ అవెలబుల్’ అంటూ మెసేజ్ డిస్‌ప్లే అవ్వటం మొదలైంది. అది చూసిన వారంతా షాక్ అయ్యారు. అయితే, తరువాత కొద్ది సమయంలోనే మన ‘మనోహరి’ తిరిగి ప్రత్యక్షమైంది. ఆమె అకౌంట్లో వీడియోలు, పోస్టులు అన్నీ కూడా గతంలో మాదిరిగా కనిపిస్తున్నాయి. దాంతో నోరా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ, నోరా అకౌంట్‌కి అకస్మాత్తుగా ఏమైనట్టు? ఇప్పటి వరకూ ఆమె స్సందించలేదు. తానే డీయాక్టివేట్ చేసి రీయాక్టివేట్ చేసిందా? లేక హ్యకైందా? తెలియాల్సి ఉంది...   

Updated Date - 2022-02-05T04:17:58+05:30 IST