చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం లేదు

ABN , First Publish Date - 2021-10-15T21:55:55+05:30 IST

పు 16వ తేదీన ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ‘మా’ సభ్యులందరికీ కార్యాలయం నుంచి యసెమ్మెస్ ఆహ్వానం అందింది. బహుశా క్రమశిక్షణా సంఘంలో సభ్యుడిగా కొద్ది కాలం కొనసాగి రాజీనామా చేసిన చిరంజీవికి ప్రత్యేకమైన ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాలు తెలియచేశాయి. సాధారణంగా కొత్త కమిటీ ఏర్పాటైనప్పుడు దాని ప్రమాణ స్వీకారానికి ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని పిలవడం రివాజు.

చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం లేదు

రేపు 16వ తేదీన ‘మా’ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ‘మా’ సభ్యులందరికీ కార్యాలయం నుంచి యసెమ్మెస్ ఆహ్వానం అందింది. బహుశా క్రమశిక్షణా సంఘంలో సభ్యుడిగా కొద్ది కాలం కొనసాగి రాజీనామా చేసిన చిరంజీవికి ప్రత్యేకమైన ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాలు తెలియచేశాయి. సాధారణంగా కొత్త కమిటీ ఏర్పాటైనప్పుడు దాని ప్రమాణ స్వీకారానికి ఇండస్ట్రీలోని ప్రముఖుల్ని పిలవడం రివాజు. ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరు కావాలని ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు తండ్రి డిఆర్సీ సభ్యులు మోహన్ బాబు ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలకు ఫోన్లు చేసి ఆహ్వానించారు. మరి చిరంజీవిని కూడా వారు కలిసి ఆహ్వానిస్తారా లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే కొందరు విశ్లేషకులు ఊహించినట్టుగా విష్ణు నుంచి కానీ, మోహన్ బాబు నుంచి కానీ చిరంజీవికి ఎటువంటి ఆహ్వానం అందలేదు. 


2015 నుంచి అధ్యక్షపదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతల్ని స్వీకరించడం అన్నది ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ దానికి భిన్నంగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి ముందే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హాజరవ్వాలి అనే విషయంలో ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. 2019 లొ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా సంఘానికి కృష్ణం రాజు చైర్మన్ గా వ్యహరిస్తున్నారు. ఇందులో మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధ, చిరంజీవి సభ్యులుగా ఉన్నారు. చిరంజీవి డీఆర్సీ నుంచి గతేడాది రాజీనామా చేశారు. అయితే దాన్ని అప్పట్లో సభ్యులు ఆమోదించలేదు. ఈ డీఆర్ సీ పదవీకాలం ఎన్నికలు పూర్తయ్యే దాకా మాత్రమే ఉంటుదని , ఆ తర్వాత కొత్త గా ఏర్పడిన కమిటీ కార్యవర్గం ఈ సంఘాన్ని కొనసాగించాలా లేదా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటుందని  మా ప్యానెల్ అడ్వైజర్ కృష్ణ మోహన్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన మంచు విష్ణు కార్యవర్గం డీఆర్సీని కొనసాగిస్తుందా లేదా, దానిలో మార్పులు చేర్పులు చేస్తుందా అనే విషయం తెలియాలంటే. మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-10-15T21:55:55+05:30 IST