Priyanka Arul Mohan: అక్కడ ఓకే.. మరి ఇక్కడ..?

ABN , First Publish Date - 2022-05-22T18:58:05+05:30 IST

ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)..చూడగానే అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే ఈమెది చెన్నై. కన్నడ సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమా చేసిన ప్రియాంక ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాలతో పాపులారయ్యారు.

Priyanka Arul Mohan: అక్కడ ఓకే.. మరి ఇక్కడ..?

ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)..చూడగానే అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే ఈమెది చెన్నై. కన్నడ సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమా చేసిన ప్రియాంక ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాలతో పాపులారయ్యారు. తెలుగులో నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్ లీడర్ (Gang Leader) సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే, అందం అభినయం పరంగా ప్రియాంకకు మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) సరసన శ్రీకారం (Sreekaram) సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకున్నారు.


ఈ మూవీలో కాస్త గ్లామర్‌గానూ కనిపించి ఆకట్టుకున్నారు. కానీ, శ్రీకారం బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇలా ప్రియాంక తెలుగులో నటించిన రెండు సినిమాలు కమర్షియల్‌గా హిట్ సాధించకపోవడంతో ఇక్కడ దర్శక నిర్మాతలెవరూ పట్టించుకోలేదు. దాంతో, తెలుగులో అసలు అవకాశాలు లేకుండా పోయాయి. అయితే, తమిళంలో మాత్రం అడపాదడపా హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూ నెట్టుకొస్తున్నారు. తమిళంలో స్టార్ హీరోలైన సూర్య (Surya), శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan)లతో సినిమాలు చేశారు. 


సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈటీ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక శివ కార్తికేయన్ సరసన డాక్టర్ సినిమాలో నటించి హిట్ అందుకున్నారు. అదే హీరోతో మరో సినిమా చేశారు. డాన్ టైటిల్‌తో ఈ నెల 13న రిలీజైన ఈ మూవీ కోలీవుడ్ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. కాగా, త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించబోతున్న సినిమాలో ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. చెప్పాలంటే తమిళంలో ప్రియాంక నెమ్మదిగా బండి లాగిస్తున్నారు. కానీ, తెలుగు తెరపైనే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో తెలియడం లేదు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.  

Updated Date - 2022-05-22T18:58:05+05:30 IST