కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అవమానం

ABN , First Publish Date - 2021-11-25T23:21:28+05:30 IST

అలనాటి నటి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అవమానం జరిగింది. తను రాసిన పుస్తకం ‘‘లాల్ సలామ్’’ను ప్రమోట్ చేయడానికి కపిల్ శర్మ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అవమానం

అలనాటి నటి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అవమానం జరిగింది. తను రాసిన పుస్తకం ‘‘లాల్ సలామ్’’ను ప్రమోట్ చేయడానికి కపిల్ శర్మ షోకు ఆమె వెళ్లింది. కానీ, అక్కడున్న సెక్యూరిటీ గార్డులు ఆమెను గుర్తుపట్టక పోవడంతో లోనికి అనుమతిని నిరాకరించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జోమాటో డెలివరీ బాయ్‌ను సెక్యూరిటీ గార్డులు ఆపలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కపిల్ శర్మ షో షూటింగ్‌కు హాజరు కాకుండా వెనుతిరిగారు.


కపిల్ శర్మ షో ప్రొడక్షన్ సిబ్బందికి ఈ విషయం తెలియడంతో ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయినప్పటికీ షూటింగ్ మాత్రం ఆగిపోయింది. అనంతరం భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రొడక్షన్ సిబ్బందితో చర్చలు జరిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర మంత్రి సాయంత్రం పూట షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డు ఆమెను గుర్తుపట్టలేదు. లోపలికి అనుమతిని  నిరాకరించారు. తనను షో నిర్వహకులే ఆహ్వానించారని చెప్పినప్పటికీ అక్కడున్న భద్రతా సిబ్బంది వినిపించుకోలేదు. ‘‘ సారీ మేడం. మీరు లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు. మిమ్మల్ని లోపలికి పంపిచడానికి మాకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు ’’ అని సెక్యూరిటీ గార్డు చెప్పారు. భద్రతా సిబ్బందికి నచ్చచెప్పడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. అదే సమయంలో జోమాటో డెలివరీ బాయ్ అక్కడికి వచ్చాడు. సెక్యూరిటీ అతడిని ఆపలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె అక్కడి నుంచి వెనుతిరిగారు. కేంద్రమంత్రిని తాను ఆపేశానని సెక్యూరిటీ గార్డుకు తెలియడంతో అతడు ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయడం గమనార్హం.

Updated Date - 2021-11-25T23:21:28+05:30 IST