Chiranjeevi: రాజమౌళి దర్శకత్వంలో చేయను!

ABN , First Publish Date - 2022-10-01T16:31:57+05:30 IST

టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న స్టార్‌ హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని, ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎస్టాబ్లిష్‌ కావాలనే కోరికలు లేవని చిరంజీవి అన్నారు.

Chiranjeevi: రాజమౌళి దర్శకత్వంలో చేయను!

టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళి (Raja mouli)దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న స్టార్‌ హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి (Megs star chiranjeevi)మాత్రం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని, ప్యాన్‌ ఇండియా స్టార్‌గా ఎస్టాబ్లిష్‌ కావాలనే కోరికలు లేవని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా విడుదలకు సిద్ధమైన ‘గాడ్‌ ఫాదర్‌’ (God father)ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి బాలీవుడ్‌కు చెందిన ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.  ‘రాజమౌళితో దర్శకత్వంలో చేయనని ఈ మధ్యనే అన్నారు కదా ఎందుకు అని సదరు జర్నలిస్ట్‌ ప్రశ్నించగా..(No desire to act in Rajamouli’s direction) 


‘‘రాజమౌళి అద్భుతమైన దర్శకుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.  సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారాయన. ఆర్టిస్ట్‌ నటనలో పర్ఫెక్షన్‌ వచ్చేవరకూ , బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చే వరకూ వదలరు. ఆ డెడికేషన్‌ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆయన కోరుకునే అవుట్‌పుట్‌ ఓ నటుడిగా నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. ఓ సినిమా రూపొందించడానికి ఆయన ఎంత సమయం వెచ్చిస్తారో తెలిసిందే! కథ అనుకున్నప్పటి నుంచి ఒక సినిమాకు మూడు నుంచి ఐదేళ్లు ట్రావెల్‌ చేస్తారు. నేనేమో ఒకేసారి నాలుగు చిత్రాలతో బిజీగా ఉంటున్నా. అందుకే ఆయనతో పనిచేయాలని, ప్యాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాలని లేదు. కానీ ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉంది’’ అని చిరంజీవి నవ్వుతూ చెప్పుకొచ్చారు. మలయాళ హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్‌ రాజా దర్శకుడు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. పొలిటికల్‌ యాక్షన్‌ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌, సముద్రఖని నటించారు. 


Updated Date - 2022-10-01T16:31:57+05:30 IST