Nithin : ఒకే యూనిట్‌తో రెండు సినిమాలు

ABN , First Publish Date - 2022-05-19T16:27:44+05:30 IST

యంగ్ హీరో నితిన్ (Nithin) ‘భీష్మ’ (Bheeshma) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత .. ‘చెక్, రంగ్‌దే, మాస్ట్రో’ చిత్రాలతో వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలున్నాయి.

Nithin : ఒకే యూనిట్‌తో రెండు సినిమాలు

యంగ్ హీరో నితిన్ (Nithin) ‘భీష్మ’ (Bheeshma) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత .. ‘చెక్, రంగ్‌దే, మాస్ట్రో’ చిత్రాలతో వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఈ రెండు చిత్రాలు అతడి సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌లోనే  నిర్మాణం జరుపుకుంటున్నాయి. వాటిలో కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి (Rajasekhar reddy) దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam) లో నటిస్తూనే.. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీకి కమిట్ అయ్యాడు. ఇటీవల సినిమా గ్రాండ్‌గా లాంఛ్ అయింది.  షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో శ్రీలీల (Srileela) కథానాయిక. రీసెంట్‌గా విదేశాల్లో ఒక సాంగ్ చిత్రీకరణ జరుపుకొచ్చింది టీమ్. 


ప్రస్తుతం ఇటలీలో ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam) చిత్రం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులోని మూడు పాటల్ని షూట్ చేయాలి. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. అయితే ఆ ఖాళీని కూడా భర్తీ చేయాలనే ఉద్దేశంతో వక్కంతం సినిమాకి సంబంధించిన ఒక పాటను కూడా అక్కడ పూర్తి చేశారు. శ్రీలీల, వక్కంతం, డాన్స్ మాస్టర్, కెమేరామేన్ మాత్రమే ఇండియా నుంచి వెళ్ళారు. మిగిలివారంతా మాచర్ల నియోజకవర్గం టీమే. అలా ఒకే దేశంలో ఒకే యూనిట్ తో రెండు సినిమాలకు సంబంధించిన షూట్స్ ను పూర్తి చేయడం నితిన్‌కు మాత్రమే చెల్లింది. 


ఈ రెండు సినిమాలపై నితిన్ (Nithin) చాలా ఆశలుపెట్టుకున్నాడు. ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam)  పొలిటికల్ థ్రిల్లర్ అయితే.. వక్కంతం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పక్కా యాక్షన్ చిత్రం. రేసుగుర్రం (Racegurram) తరహాలోని రేసీ స్ర్కీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కుతోంది.  మాచర్ల నియోజకవర్గం చిత్రం పూర్తయిన వెంటనే వక్కంతం చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టబోతున్నాడు.  మరి నితిన్ కు ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తాయో చూడాలి. 

Updated Date - 2022-05-19T16:27:44+05:30 IST