Nikhil Siddhartha : ‘18 పేజెస్’ దశ తిరిగింది !

ABN , First Publish Date - 2022-08-23T21:14:44+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ (Nikhil Siddharth) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 70కోట్లకు పైగానే వసూళ్ళు కురిపించిన ఈ సినిమా రూ. 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై సైతం వసూళ్ళ దండయాత్ర చేస్తోంది.

Nikhil Siddhartha : ‘18 పేజెస్’ దశ తిరిగింది !

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ (Nikhil Siddharth)  ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 70కోట్లకు పైగానే వసూళ్ళు కురిపించిన ఈ సినిమా రూ. 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై సైతం వసూళ్ళ దండయాత్ర చేస్తోంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్.. నిఖిల్ తదుపరి చిత్రం ‘18 పేజెస్’ (18 Pages) కు వరంగా మారింది. సుకుమార్ (Sukumar) శిష్యుడు ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21 F ) ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ (Palnati Surya Prathap) దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. నాలుగు నెలల క్రితమే టీజర్ కూడా విడుదలైంది. ‘గీతా ఆర్ట్స్ 2’ నిర్మాణంలో టాప్ టెక్నికల్ టీమ్ కలయికలో రూపొందిన ఈ సినిమా నిజానికి ‘అర్జున్ సురవరం’ (Arjun Suravaram) చిత్రం తర్వాత విడుదల కావాలి.  ‘కార్తికేయ 2’ చిత్రం దీనికన్నా లేట్‌గా పూర్తయింది. కానీ అదే ముందుగా విడుదలైంది. ఇప్పుడదే కలిసొస్తోంది.


‘కార్తికేయ 2’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదరగొడుతున్న కారణంగా ‘18 పేజెస్’ చిత్రానికి బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోందని సమాచారం.  ఇందులో కూడా అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా అవడం కాకతాళీయంగా జరిగినా.. అది కూడా సినిమాకి బ్రహ్మాండంగా కలిసొస్తోంది. ఎలాగూ ‘కార్తికేయ 2’ కు నార్త్‌లో బాగా కలిసొచ్చింది. కాబట్టి ‘18 పేజెస్’ హిందీ వెర్షన్ ఒకటి రెడీ చేసుకుంటే చాలు.. మంచి ఓపెనింగ్ వసూళ్ళు కురుస్తాయి. మంచి టాక్ వస్తే ఆదాయం కూడా ఖాయం. మార్కెటింగ్ లో గీతా ఆర్ట్స్ వారి నైపుణ్యం చెప్పనక్కర్లేదు. కాబట్టి ఆ యాంగిల్ కూడా చిత్రానికి అడ్వాంటేజ్ గా మారుతుంది. 


నిఖిల్ తదుపరి చిత్రం ‘స్పై’ (Spy) కు సైతం మంచి బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. యూనివర్సల్ కథాంశం కాబట్టి.. అదే టైటిల్ తో నార్త్ లోనూ విడుదల చేయొచ్చు. మొత్తానికి ఒక్క కార్తికేయ 2 చిత్రం ముందుగా విడుదలవడం వల్ల వరుసలో ఉన్న నిఖిల్ రెండు చిత్రాలకు మంచి మార్కెట్ ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. కాకపోతే వాటి కథాంశాలు ప్రేక్షకుల్ని మెప్పించాలి. సో.. ఒకోసారి ఆలస్యం కూడా అమృతం అవుతుందని దీన్ని బట్టి అర్ధమవుతోంది.  

Updated Date - 2022-08-23T21:14:44+05:30 IST