Spy: హై వోల్టేజ్ యాక్షన్ మొదలెట్టిన నిఖిల్

ABN , First Publish Date - 2022-05-21T22:59:58+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) హీరోగా.. ‘గూఢచారి, ఎవరు, హిట్..’ వంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్‪గా పనిచేసిన గ్యారీ బిహెచ్ (Garry BH) దర్శకత్వంలో.. ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్

Spy: హై వోల్టేజ్ యాక్షన్ మొదలెట్టిన నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) హీరోగా..  ‘గూఢచారి, ఎవరు, హిట్..’ వంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్‪గా పనిచేసిన గ్యారీ బిహెచ్ (Garry BH) దర్శకత్వంలో.. ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Ed Entrainments) పతాకంపై చరణ్ తేజ్ ఉప్పలపాటి (Charan Tej Uppalapati) సిఈఓగా.. నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి (K RajaShekhar Reddy) నిర్మిస్తున్న చిత్రం ‘స్పై’ (Spy).  భారీ బడ్జెట్‪తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరణ జరుపుతున్నట్లుగా మేకర్స్ తాజాగా ప్రకటిస్తూ.. కొన్ని ఫొటోలను విడుదల చేశారు. 


ఈ పిక్స్‪లో హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జూలియన్ ఎస్ట్రాడా (Julian Amaru Estrada)‪తో పాటు ఈ యాక్షన్ సెట్స్‪లో ‘మేరీ కోమ్ (Mary Kom), శకుంతలా దేవి(Shakunthala Devi), తాన్హాజీ (Tanhaji)’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో భాగమైన బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా (Keiko Nakahara) కనిపించారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ (Lee Whitaker) యాక్షన్ సన్నివేశాలను సూపర్ వైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్‌పాండే (Makrand Deshpande) పాటు అభినవ్ గోమతం (Abhinav Gomatam), ఐశ్వర్యా మీనన్ (Ishwarya Menon), సన్యా ఠాకూర్‌(Sanya Thakur)లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.


ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తన మొదటి పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న ‘స్పై’లో సరికొత్త లుక్, భిన్నమైన పాత్రలో అలరించనున్నారు నిఖిల్. పూర్తి యాక్షన్‌ ‘స్పై’ థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2022-05-21T22:59:58+05:30 IST