Nikhil: చాలా టెన్షన్ గా ఉంది..

ABN , First Publish Date - 2022-08-12T15:33:43+05:30 IST

పైకి నవ్వుతున్నప్పటికీ చాలా టెన్షన్ గా ఉన్నాను..అన్నారు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha). ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 (Karthikeya 2).

Nikhil: చాలా టెన్షన్ గా ఉంది..

పైకి నవ్వుతున్నప్పటికీ చాలా టెన్షన్ గా ఉన్నాను..అన్నారు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha). ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2 (Karthikeya 2). మరికొన్ని గంటల్లో ఈ మూవీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరిపారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరోలు అడివి శేష్ (Adivi Sesh), సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.


ఆయన మాట్లాడుతూ..'చందూ మొండేటి 'కార్తికేయ 2' కథ చెప్పిన దగ్గర నుంచి ప్రతీ ఒక్కరం ఈ కథ కోసం రెండున్నరేళ్లుగా కష్టపడుతూ వచ్చాము. రెండున్నరేళ్ళుగా మేము పడిన కష్టం.. ఇప్పుడు మీ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే నేను పైకి నవ్వుతున్నప్పటికీ చాలా టెన్షన్ గానే ఉన్నాను. ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్టుగా అడివి శేష్ రావడం చాలా ఆనందంగా ఉంది. కంటెంట్ ఉంటే చాలు పెద్ద బడ్జెట్ అవసరం లేదు..అని  'మేజర్' సినిమాతో ఆయన నిరూపించారు. 


సింగీతం శ్రీనివాసరావుగారు చేసిన ప్రయోగాలు చూస్తూ పెరిగాను. కొత్తదనం కోసం తపించడమనేది ఆయన నుంచే ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాను. అలాంటి ఆయన మా కార్తికేయ సినిమాపై నమ్మకాన్ని వ్యక్తం చేయడం ఆనందంగా ఉంది. ఈ మధ్య థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలకు జనాలు వస్తారనే విషయం మరిచిపోకూడదు. అందుకు ఉదాహరణగా ఇటీవల వచ్చిన 'మేజర్' .. 'బింబిసార' .. 'సీతా రామం' సినిమాలే. కథలో విషయం ఉంటే థియేటర్స్ హౌజ్ ఫుల్ అవుతాయి. మా సినిమా నిర్మాతలు మాకు అందించిన సహకారం నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్నారు.

Updated Date - 2022-08-12T15:33:43+05:30 IST