Nikhil Siddharth: ‘కార్తికేయ -2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

ABN , First Publish Date - 2022-09-10T01:59:01+05:30 IST

యంగ్, డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) గతంలో నటించిన చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ‘కార్తికేయ-2’ (Karthikeya 2) రూపొందింది. చందు మొండేటి

Nikhil Siddharth: ‘కార్తికేయ -2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

యంగ్, డైనమిక్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) గతంలో నటించిన చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ‘కార్తికేయ-2’ (Karthikeya 2) రూపొందింది. చందు మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ మూవీని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌కు నాలుగు రోజుల్లోనే లాభాలను పంచడం మొదలుపెట్టింది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయినవారంతా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ డిజిటల్ ప్లాట్‌ఫామ్ త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించనుందని సమాచారం.  


‘కార్తికేయ-2’ స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘జీ-5’ సొంతం చేసుకుందని టాక్. ఈ సినిమా సెప్టెంబర్ 30నుంచి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాం త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందట. ‘కార్తికేయ-2’ నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్‌గా రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 1.5మిలియన్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. హిందీ బెల్ట్‌లో ‘కార్తికేయ-2’కు అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు 50షోస్‌ను ప్రదర్శించగా, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఆ షోస్‌ను క్రమంగా పెంచారు. ఫలితంగా ఐదు రోజుల్లోనే షోస్ సంఖ్య 1575కు చేరింది. బాలీవుడ్‌ భారీ బడ్జెట్ చిత్రాలు ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) లను తట్టుకుని ‘కార్తికేయ-2’ చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టడం విశేషం. 

Updated Date - 2022-09-10T01:59:01+05:30 IST