Nikhil: ఫిల్మ్ ఇండస్ట్రీ‌లో ఏ యాక్టర్‌కూ ఇలా జరిగి ఉండదు

ABN , First Publish Date - 2022-08-04T01:58:33+05:30 IST

నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై చందు మొండేటి (Chandoo Mondeti) ద‌ర్శక‌త్వంలో టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న

Nikhil: ఫిల్మ్ ఇండస్ట్రీ‌లో ఏ యాక్టర్‌కూ ఇలా జరిగి ఉండదు

నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్  బ్యానర్లపై చందు మొండేటి (Chandoo Mondeti) ద‌ర్శక‌త్వంలో టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). సూపర్ సక్సెస్ ఫిల్మ్ ‘కార్తికేయ’ (Karthikeya)కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ముందు ప్రకటించిన తేదీన కాకుండా ఒక రోజు ఆలస్యంగా ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల కానుంది. ఆగస్ట్ 11, 12న విడుదలకాబోతోన్న చిత్రాలతో పోటీ పడటం ఇష్టం లేకే.. ఈ చిత్రాన్ని ఒక రోజు ఆలస్యంగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం రెండు మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి యూనిట్ ఒక రోజుకి వాయిదా వేశారు. ఆ వివరాలను తెలిపేందుకు తాజాగా మేకర్స్  మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్లతో పాటు దర్శకనిర్మాతలు కూడా పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, వైవా హర్ష, సత్య  వీరంతా బిజీగా ఉన్నా.. ఈ కథను, కాన్సెప్ట్‌ను నమ్మి.. మాతో ట్రావెల్ అయ్యారు. అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు అందరూ మమ్మల్ని, చందు మొండేటి గారిని నమ్మి.. పాండమిక్  టైమ్‌లో ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. క్రియేటివ్ టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆగష్టు 13 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పగలను. ఇప్పటికే విడుదల చేసిన ‘కార్తికేయ 2’ ట్రైలర్ 1కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరి నుండి కూడా మంచి అభినందనలు వస్తున్నాయి. మీ సినిమా ఎలా ఉన్నా.. థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తాము అని కామెంట్స్ వినబడుతున్నాయి. మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులకు గ్రాండ్‌గా బిగ్ స్క్రీన్‌పై మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని  తీసిన సినిమా ఇది. అందుకే నేను ఈ మధ్య  థియేటర్, థియేటర్ అంటున్నాను. ఇప్పుడప్పుడే ఈ సినిమా ఓటీటీలో రాదు. ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాని.. అందరూ థియేటర్స్‌కు వచ్చి చూడాలని.. తప్పకుండా ఒక కొత్త అనుభూతిని ఈ చిత్రం ఇస్తుందని చెప్పగలను. టీజర్, ట్రైలర్ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారు. ఆగస్ట్ 6న ట్రైలర్ 2 ను రిలీజ్ చేస్తున్నాము’’ అని తెలిపారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.


‘అర్జున్ సురవరం’కు కూడా డేట్స్ మారుతూ వచ్చింది. చివరికి అది హిట్ అయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రావడానికి కారణమేంటి? గ్యాప్ వచ్చినా ఈ సినిమాకు కూడా డేట్స్ మారాయి. అది మీకు సెంటిమెంట్ అనుకుంటున్నారా?

నిఖిల్: నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీ‌లో ఏ యాక్టర్‌కు ఇలా జరిగి ఉండదు. గండం వస్తే సక్సెస్ అవుతుంది.. సెలబ్రేట్ చేసుకుంటాను అనుకోలేదు. అయితే నాకు కూడా ఎక్కడో ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ కూడా డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా.. అది మాకు బిగ్ హడల్. ‘అర్జున్ సురవరం’ తరువాత నేను సినిమా చేయకపోవడానికి ముఖ్య  కారణం పాండమిక్. అందుకే సినిమా చేయలేకపోయాం. ఆ సినిమా హిట్ తరువాత  మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ‘కార్తికేయ 2’ కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది.


ఓటీటీలో కాకుండా థియేటర్‌కే వెళ్లి చూడాల్సిన ప్రత్యేకతలు ఈ సినిమాలో ఏమున్నాయి?

నిఖిల్: ఈ సినిమా డిజైనింగ్‌లోనే థియేటర్‌కు వచ్చి చూడాలనేలా ప్లాన్ చేసుకున్నాము. కృష్ణుడు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సినిమా తీస్తే గ్రాండ్‌గా ఉండాలి. ‘అన్నమయ్య, దేవుళ్ళు’ వంటి సినిమాలకు ఫ్యామిలీ మొత్తం థియేటర్‌కు వచ్చి సినిమా చూసే వారు. ఇప్పుడు ఎవరూ అలా రావడం లేదని.. మళ్లీ అప్పటిలా థియేటర్‌కి రప్పించాలనే.. మంచి భక్తితో పాటు అడ్వెంచర్, థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. థియేటర్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు.


ఐదు లాంగ్వేజ్‌లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.. మీరు పాన్ ఇండియా స్టార్ అవ్వాలనుకున్నారా? లేక ఇది యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారా?

నిఖిల్: ఈ సినిమాను డిఫరెంట్ డిఫరెంట్ భాషల్లో ఎక్కువ మంది చూడాలని తీశాము. ఈ సినిమాకు నేను హీరోను కాదు. మేము ఎంచుకున్న పాయింట్ కృష్ణ తత్త్వం. మా సినిమా హీరో కృష్ణుడే అని మేము చాలా నమ్మాము. ఇప్పుడు కూడా కృష్ణుడే మమ్మల్ని నడిపిస్తున్నాడని అనుకుంటున్నాము. ఈ కథ యూనివర్సల్. అన్ని చోట్లా కృష్ణున్ని పూజిస్తారు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప దేవుడిపై సినిమాగా తీసినప్పుడు అన్ని భాషల్లో ఉండాలని తీశాము. ఇస్కాన్ వారు మమ్మల్ని మధురకు పిలిచారు. మేమంతా వెళ్ళాము. అది మాకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అంతే తప్ప.. నేను పాన్ ఇండియా స్టార్ కావాలని మాత్రం కాదు.


ఇకపై మీరు చేయబోయే  సినిమాలు 4,5 భాషలలో ఉంటాయా?

నిఖిల్: ఒక వేళ నా సినిమాలకు డిమాండ్ ఉంటే ఉండవచ్చు. ప్రతి సినిమా ఉంటుంది అని చెప్పలేను. కొన్ని సార్లు రీజనల్ ఫిల్మ్స్ చేస్తాము. ఇప్పుడు లేను  ‘స్పై’ ఫిలిం చేస్తున్నాను. రా ఏజెంట్ సినిమాను ఇండియా మొత్తం చూస్తారు అనుకున్నప్పుడు అవి వర్కవుట్ అవుతాయి.


లాస్ట్ ఎన్నికలలో వై.కా.పా (YCP)కు సపోర్ట్ చేశారు.. ఇప్పుడు కూడా అదే పార్టీకి సపోర్ట్‌గా ఉన్నారా?

నిఖిల్: నాకు పార్టీ, పాలిటిక్స్ అంటూ ఏమీ లేవు.. నేను ఎప్పుడూ యాక్టర్‌నే. అయితే అప్పుడు నాకు తెలిసిన వారు పోటీ చేయడంతో ప్రచారం చేశాను. అంతే కాదు, అంతకుముందు  కూడా నాకు తెలిసిన వారు పోటీ చేస్తే నేను తెలుగుదేశం (TDP), జనసేన (Janasena)లకు కూడా ప్రచారం చేశాను తప్ప.. నాకు సినిమానే ప్రపంచం.

Updated Date - 2022-08-04T01:58:33+05:30 IST