Karthikeya 2 ట్రైలర్: ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-08-07T00:35:22+05:30 IST

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంట‌గా చందు మొండేటి (Chandoo Mondeti) ద‌ర్శక‌త్వంలో.. సూపర్ హిట్ చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya)కి సీక్వెల్‌గా రూపొందుతోన్న

Karthikeya 2 ట్రైలర్: ఎలా ఉందంటే..

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంట‌గా చందు మొండేటి (Chandoo Mondeti) ద‌ర్శక‌త్వంలో.. సూపర్ హిట్ చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya)కి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2).  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 13న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను మాస్ మహారాజా రవితేజ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ‘ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. చూస్తుంటే మరో టాప్ క్లాస్ ఫిల్మ్ రాబోతున్నట్లుగా అనిపిస్తుంది. టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’ అని రవితేజ (Ravi Teja) ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్‌ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. (Karthikeya 2 Trailer)


ట్రైలర్ విషయానికి వస్తే.. ఓపెనింగ్ షాట్ ఒక్కటి చాలు ఈ ట్రైలర్ అదిరిపోయింది అని చెప్పడానికి. ‘5 సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం..పరిష్కారం లిఖితం...’ అనే డైలాగ్‌తో అద్భుతమైన విజువల్స్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘మొక్కు అనేది రుణం వంటిది.. శేషం ఉంచకూడదు తల్లి.. వీలైనంత త్వరగా ద్వారక వెళ్లి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి’.. అని ఓ స్వామిజీ చెప్పిన డైలాగ్‌తో ఈ కథ ఎలా మొదలవబోతుందనేది తెలుస్తుంది. ఆ తర్వాత ద్వారక ఓ పెద్ద సమస్యలో ఉన్నట్లుగా చూపిస్తూ.. ‘నా వరకు రానంత వరకే సమస్య.. నా వరకు వచ్చాక అది సమాధానం’ అని నిఖిల్ చెప్పిన డైలాగ్‌,  ‘ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే’ అంటూ అనుపమ్ ఖేర్ చెబుతున్న డైలాగ్.. ఈ సినిమా ‘కార్తికేయ’కు పర్ఫెక్ట్ సీక్వెల్‌గా తెరకెక్కించారనేది తెలియజేస్తుంది. ముఖ్యంగా గ్రాఫికల్ షాట్స్, లొకేషన్స్, మ్యూజిక్ హైలెట్‌గా ఉండబోతున్నాయని.. రవితేజ చెప్పినట్లుగా ఓ విజువల్ వండర్‌ని టీమ్ ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారనే విషయాన్ని ఈ ట్రైలర్ చెప్పేస్తుంది. ఓవరాల్‌గా ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా.. శ్రీకృష్ణుడికి సంబంధించిన మిస్టరీని నిఖిల్ ఎలా ఛేదించి ఉంటాడా..! అనే ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. (karthikeya 2 Trailer)





Updated Date - 2022-08-07T00:35:22+05:30 IST