Karthikeya 2: టీజర్ రెడీ..

ABN , First Publish Date - 2022-06-23T03:59:23+05:30 IST

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil), చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కార్తికేయ‌ 2’ (Karthikeya2). ఈ సినిమా ప్రకటించినప్పటి

Karthikeya 2: టీజర్ రెడీ..

Karthikeya 2: ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil), చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘కార్తికేయ’ (Karthikeya). ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘కార్తికేయ‌ 2’ (Karthikeya2). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం’ అంటూ హీరో నిఖిల్ వాయిస్‌తో వచ్చిన మోషన్ పోస్టర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. టీజర్ రెడీ.. జూన్ 24న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


నిఖిల్ సరసన ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తున్న ఈ చిత్రంలో.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కీలక పాత్రలో నటిస్తున్నారు. మోషన్ పోస్టర్‌తోనే చిత్రంలోని భావాన్ని ద‌ర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల క‌ళ్ళకు క‌ట్టిన‌ట్టు చూపించారు. ఇక రాబోయే టీజర్.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేచి చూసేలా చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి.. జూలై 22న ప్రపంచ‌ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 



Updated Date - 2022-06-23T03:59:23+05:30 IST