Actor Nikhil: బాలీవుడ్ ఖాన్‌లు అందరూ పాకిస్తాన్ గురించి ట్వీట్ చేయగలగాలి..

ABN , First Publish Date - 2022-08-30T23:16:45+05:30 IST

గత మూడు నెలలుగా పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలు వరదల (Floods) వల్ల అతలాకుతలం అవుతున్నాయి. వాటి కారణంగా దేశంలో 1,000 మందికి పైగా..

Actor Nikhil: బాలీవుడ్ ఖాన్‌లు అందరూ పాకిస్తాన్ గురించి ట్వీట్ చేయగలగాలి..

గత మూడు నెలలుగా పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలు వరదల (Floods) వల్ల అతలాకుతలం అవుతున్నాయి. వాటి కారణంగా దేశంలో 1,000 మందికి పైగా మరణించారు. గిల్గిత్-బాల్టిస్తాన్, ఖైబర్ పుఖ్తుంఖ్వా, దక్షిణ పంజాబ్ ప్రాంతం, అలాగే బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా భారీగా నష్టపోయాయి.

 

ఈ వరదల కారణంగా పాకిస్తాన్ జనాభాలో ఏడో వంతు.. అంటే దాదాపు 33 మిలియన్ల మంది ప్రజలు సంక్షోభం కారణంగా వేరే ప్రాంతాలను తరలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ఆ దేశ ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది. ఈ తరుణంలో సహాయం కోసం అత్యవసర ఇతర దేశాల సహాయాన్ని కోరుతోంది.


ఈ వరదలపై భారత ప్రధాని స్పందిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘పాకిస్తాన్‌లో వరదల కారణంగా సంభవించిన విధ్వంసం చూసి బాధపడ్డాను. బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. గాయపడినవారు, ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రభావితమైన వారందరూ త్వరగా సాధారణ స్థితిని వస్తారని ఆశిస్తున్నాం’ అని రాసుకొచ్చారు.


ప్రధాని చేసిన ట్వీట్‌కి బాలీవుడ్ నిర్మాత, నటుడు నిఖిల్ ద్వివేది రిప్లై ఇస్తూ.. ‘సర్.. ఇది చాలా మంచి ట్వీట్. మీరు చాలా మంచి దేశాధినేత. పాకిస్తాన్ శత్రు దేశం, కానీ ఇలాంటి సమయాల్లో నిజమైన నాయకులు శత్రుత్వం కంటే మానవత్వానికే విలువిస్తారు. అమీర్‌ఖాన్ (Aamir Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), షారూఖ్‌ఖాన్ (Shah Rukh Khan), సైఫ్ అలీఖాన్ లేదా ఇతరులు ఎవరైనా కూడా స్వేచ్ఛగా అదే ట్వీట్ చేసే వాతావరణం ఇక్కడ నెలకొనాలి’ అని రాసుకొచ్చారు.




కాగా.. విమర్శకుల ప్రశంసలు పొందిన ఫైనాన్షియల్ థ్రిల్లర్ సిరీస్ స్కామ్ 1992లో వ్యాపారవేత్త కేఎస్ త్యాగిగా నిఖిల్ నటించారు. 1992లో హర్షద్ మెహతా నేతృత్వంలోని భారతీయ స్టాక్ మార్కెట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే.. ఇంతకుముందు.. ‘మై నేమ్ ఈజ్ ఆంథోనీ గోన్సాల్వేస్’, ‘రావణ్’, ‘షోర్ ఇన్ ది సిటీ’ వంటి చిత్రాలలో నిఖిల్ నటించారు. దాంతోపాటు ‘వీరే ది వెడ్డింగ్’, ‘దబాంగ్ 3’ వంటి చిత్రాలను నిర్మించారు.

Updated Date - 2022-08-30T23:16:45+05:30 IST