'The Kashmir Files' సినిమా గురించి న్యూజీలాండ్ మాజీ ఉప ప్రధాని ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-03-21T00:07:05+05:30 IST

భారతదేశంలో అనూహ్య విజయం సాధించిన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ న్యూజిలాండ్ దేశంలోనూ చర్చకు దారి తీస్తోంది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన మూవీ అక్కడ ఇంకా విడుదల కాలేదు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల్లో ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ఇప్పటికే ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది. కానీ, న్యూజీలాండ్‌లో మాత్రం ఇంకా సెన్సార్ బోర్డ్ పరిశీలినలో ఉంది.

'The Kashmir Files' సినిమా గురించి న్యూజీలాండ్ మాజీ ఉప ప్రధాని ఏమన్నారంటే...

భారతదేశంలో అనూహ్య విజయం సాధించిన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ న్యూజిలాండ్ దేశంలోనూ చర్చకు దారి తీస్తోంది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన మూవీ అక్కడ ఇంకా విడుదల కాలేదు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల్లో ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ఇప్పటికే ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది. కానీ, న్యూజీలాండ్‌లో మాత్రం ఇంకా సెన్సార్ బోర్డ్ పరిశీలినలో ఉంది. 

న్యూజీలాండ్ సెన్సార్ అధికారులు ఇప్పటి వరకూ ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు నో చెప్పలేదు. అయితే, కొన్ని మత సంస్థలు, వర్గాల నుంచీ అభ్యంతరాలు రావటంతో సినిమాకు ఇవ్వాల్సిన రేటింగ్, గ్రేడింగ్ వంటి అంశాలపై తర్జనభర్జన జరుగుతోంది. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ ముస్లిమ్‌లకు వ్యతిరేకంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉందని కొందరు వాదిస్తున్నారు. 

తమ సినిమా న్యూజీలాండ్‌లో విడుదల కాలేదని ట్విట్టర్‌లో పేర్కొన్న వివేక్ అగ్నిహోత్రికి ఆ దేశ మాజీ ఉప ప్రధాని నుంచీ మద్దతు లభించింది. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు సెన్సార్ అడ్డంకులు కలిగించటం అంటే న్యూజీలాండ్ ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించటమే అన్నారు విన్‌స్టన్ పీటర్స్. ‘‘సత్యమైన, యదార్థ సంఘటనలతో రూపొందిన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాను సెన్సార్ చేయటం అంటే... 9/11 అటాక్స్ తాలూకూ చిత్రాల్ని జనం మరిచిపోయేలా చేయటంతో సమానమే...’’ అంటూ పీటర్ పోలిక తీసుకొచ్చారు. అమెరికాలో ట్విన్ టవర్స్‌పై జరిగిన సెప్టెంబర్ 11 దాడి గురించి ఆయన ప్రస్తావించారు. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలో చూపిన ఉగ్రవాదుల అరాచకాలు కూడా అటువంటివే అని అభిప్రాయపడ్డారు. సినిమాను ఏ విధమైన ఆంక్షలు లేకుండా వెంటనే విడుదల చేయాలని న్యూజీలాండ్ ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విన్‌స్టన్ పీటర్ డిమాండ్ చేశారు. చూడాలి మరి, న్యూజీలాండ్ సెన్సార్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... 

Updated Date - 2022-03-21T00:07:05+05:30 IST