తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-16T13:45:57+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా నవంబర్ 15న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


జురాసిక్ వరల్డ్ క్యాంప్ క్రిటాసీయస్ హిడెన్ అడ్వెంచర్ (Jurassic World Camp Cretaceous: Hidden Adventure)

అనుకోకుండా పెద్ద తుఫాను వస్తుంది. దాని వల్ల ఆహారం కొరత కారణంగా డైనోసార్స్ ఆకలితో అలమటిస్తూ ఉంటాయి. వారికి కొందరు పిల్లలు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ తరుణంలో వారికి ఎదురైన సంఘటనల సమహారమే ఈ చిత్రం. ఈ యానిమేటెడ్ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


ది ఫస్ట్ రెస్పాండర్స్ (The First Responders)

ది ఫస్ట్ రెస్పాండర్స్ అనేది ప్రస్తుతం కొనసాగుతున్న దక్షిణ కొరియా టెలివిజన్ ధారావాహిక. ఇందులో కిమ్ రే-వాన్, సన్ హో-జున్, గాంగ్ సెయుంగ్-యెన్ కీలక పాత్రల్లో నటించారు.  దీని మొదటి సీజన్ నవంబర్ 12, 2022న SBS TVలో ప్రసారం అయ్యింది. ఈ టీవీ సీరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది.


నెట్ ఫ్లిక్స్ (Netflix)

Deon Cole: Charleen's Boy - ఇంగ్లిష్

Call the police - ఇంగ్లిష్, స్వీడిష్

Updated Date - 2022-11-16T13:45:57+05:30 IST