తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-13T14:22:55+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


వరాల్ (Varaal)

కేరళ జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాగే కథే ‘వరాల్’. గత పదేళ్లుగా అచ్యుతన్ నాయర్ సీఎంపై కుర్చిపై కూర్చుని అధికారం చెలాయిస్తుంటాడు. ఈ తరుణంలోనే ఢిల్లీ హైకమాండ్ కొత్తగా వచ్చిన డేవిడ్ జాన్ మెదయిల్‌ను ఆ పదవికి సిఫార్సు చేసింది. దీంతో వారిద్దరి మధ్య జరగే సంఘటనల సమాహారమే ఈ వరాల్. కన్నన్ తమరక్కులం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, అనూప్ మీనన్, ప్రియాంక నాయర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


ఇరవిన్ నిజాల్ (Iravin Nizhal)

ఇరవిన్ నిజాల్ అనేది 2022లో విడుదలైన తమిళ థ్రిల్లర్ చలనచిత్రం. అకిరా ప్రొడక్షన్స్ మరియు బయోస్కోప్ ఫిల్మ్ ఫ్రేమర్స్ బ్యానర్‌పై పార్తిబన్ నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రాధాకృష్ణన్ పార్థిబన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రోబో శంకర్, ప్రియాంక రూత్, బ్రిగిడా సాగా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం మొదటి ఆసియా నాన్ లీనియర్ సింగిల్-షాట్ ఫిల్మ్‌గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది.


నందు అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల తన జీవిత పరమార్థం కోసం వెతుకుతుంటాడు. ఈ తరుణంలో అతనికి ఎదురైన సంఘటనల సమాహారమే ‘ఇరవిన్ నిజాల్’. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Zen – Grogu and Dust Bunnies - మూకీ


లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)

Dangerous Liaisons - ఇంగ్లిష్


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

11:11 - అరబిక్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Immersión - స్పానిష్

Emergency Declaration - జపనీస్, ఇంగ్లిష్, కొరియన్


జెంప్లెక్స్ (Gemplex)

Adla Badli - గుజరాతీ





Updated Date - 2022-11-13T14:22:55+05:30 IST