తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-11T13:49:31+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


సినం (Sinam)

సినం అనేది జీఎన్ఆర్ కుమారవేలన్ దర్శకత్వం వహించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని ప్రధాన పాత్రలు పోషించగా.. షబీర్ సౌండ్‌ట్రాక్ ఆల్బమ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సమకూర్చాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16 సెప్టెంబర్ 2022న థియేట్రికల్‌గా విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ (Falling for Christmas)

ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ అనేది 2022లో విడుదలైన అమెరికన్ క్రిస్మస్ రొమాంటిక్ కామెడీ చిత్రం. జనీన్ డామియన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో లిండ్సే లోహన్, చోర్డ్ ఓవర్‌స్ట్రీట్, జార్జ్ యంగ్, జాక్ వాగ్నర్, ఒలివియా పెరెజ్ కీలక పాత్రల్లో నటించారు. వ్యసనాల బారిన పడి చట్టపరమైన సమస్యల ఇరుక్కున్న  యువకుడి జీవితమే ఈ చిత్రం. బ్రాడ్ క్రెవోయ్, మైఖేల్ డామియన్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్ ఫ్లిక్స్ (Netflix)

State of Alabama vs. Brittany Smith - ఇంగ్లిష్

Warrior Nun Season 2  - ఇంగ్లిష్

Love Never Lies - ఇంగ్లిష్, స్పానిష్

Satria Dewa: Gatotkaca - ఇండోనేసియా

Last Bullet 2- ఫ్రెంచ్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Don't drink and drive - హిందీ 

La unidad Season 2 - స్పానిష్

Autumn beat - ఇటాలియన్

Paris police 1900 - ఫ్రెంచ్


Discovery plus (డిస్కవరీ ప్లస్)

Money Mafia Season 3 - ఇంగ్లిష్


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney plus Hotstar)

Robo Mundial - స్పానిష్





Updated Date - 2022-11-11T13:49:31+05:30 IST