తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-09-07T14:05:53+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా సెప్టెంబర్ 6న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Get Smart With Money - ఇంగ్లిష్

Sheng Wang: Sweet and Juicy - ఇంగ్లిష్

UNTOLD: Race of the Century - ఇంగ్లిష్

CoComelon Season 6 - ఇంగ్లిష్

Diorama - స్వీడిష్

Rodrigo Marques: King of Uncouth - పోర్చుగీస్


వికిదా నో వర్గోడో (Vickida No Varghodo)

‘వికిదా నో వర్గోడో’ అనే సినిమా హాస్య ప్రధానంగా సాగే గుజరాతీ చిత్రం. రాహుల్ భోలే, వినిత్ కనోజియా దర్శకత్వం వహించిన.. ఈ చిత్రంలో మల్హర్ థాకర్, మోనాల్ గజ్జర్, మానసి రాచ్, జినాల్ బెలాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శరద్ పటేల్, శ్రేయాన్షి పటేల్, వికాస్ అగర్వాల్, పంకజ్ కేష్రువాలా నిర్మించారు. 8 జూలై 2022న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో 50 కంటే ఎక్కువ రోజులు ఆడి దాదాపు రూ.15 కోట్ల వసూళ్లని సాధించింది.

Updated Date - 2022-09-07T14:05:53+05:30 IST