Aryan Khan డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. మొబైల్‌ను తీసుకున్నారు తప్ప ఏమీ దొరకలేదట..

ABN , First Publish Date - 2021-10-06T22:05:57+05:30 IST

గత రెండు రోజులుగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ వార్తల్లో ఉంటున్నాడు. అందుకు కారణం ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్. ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ ఆర్యన్‌తో సహా 8మంది పట్టుబడ్డారు. ఆర్యన్ వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించలేదని ఎన్‌సీబీ అధికారులు తెలుపుతున్నారు.

Aryan Khan డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. మొబైల్‌ను తీసుకున్నారు తప్ప ఏమీ దొరకలేదట..

గత రెండు రోజులుగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ వార్తల్లో ఉంటున్నాడు. అందుకు కారణం ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్. ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ ఆర్యన్‌తో సహా 8మంది పట్టుబడ్డారు.  ఆర్యన్ వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించలేదని ఎన్‌సీబీ అధికారులు తెలుపుతున్నారు. అతడి తరపు లాయర్ బెయిల్ కావాలని అడగగా అందుకు కోర్టు అంగీకరించలేదు. అయినప్పటికీ ఆర్యన్‌ను కస్టడీలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


అర్బాజ్ ఖాన్ వద్ద 6గ్రాముల చరస్ లభించింది. ఆర్యన్ మొబైల్‌ను సీజ్ చేశారు తప్ప అతడి వద్ద ఎటువంటి మాదకద్రవ్యాలు లభించలేదని అతడి తరపు లాయర్ వాదించారు. ఎన్‌సీబీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపిస్తూ..‘‘ ఆర్యన్ వద్ద ఎటువంటి డ్రగ్స్ లభించనంత మాత్రాన అతడు అమాయకుడు కాదు. డ్రగ్స్ సరఫరాదారులతో అతడికి సంబంధాలు ఉన్నాయని వాట్సప్ మెసేజ్‌ల ద్వారా తెలుస్తోంది. కోడ్ భాషను ఉపయోగించి అతడు లావాదేవీలు జరిపారు. అంతర్జాతీయంగా జరిపిన లావాదేవీలను పరిశీలించాల్సి ఉంది. డ్రగ్స్ సరఫరాదారులతో అతడి సంబంధాలపై ఆరా తీయాల్సి ఉంది ’’ అని చెప్పారు.


ఢిల్లీ హైకోర్టుకు చెందిన సీనియర్ లాయర్ వివేక్ సూద్ ఈ కేసు గురించి మాట్లాడుతూ..‘‘ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం 1 గ్రాము, 1000కేజీల డ్రగ్స్‌తో పట్టుబడినా 2001 వరకు ఒకే రకం శిక్ష విధించేవారు. ఈ యాక్ట్‌కు 2001లో సవరణ చేశారు. డ్రగ్స్ తక్కువ పరిమాణంతో పట్టుబడితే తక్కువ శిక్ష, భారీ పరిమాణంలో పట్టుబడితే ఎక్కువ శిక్ష విధించేలా చట్టంలో మార్పు చేశారు’’ అని వివరించారు.

Updated Date - 2021-10-06T22:05:57+05:30 IST