One Word: సోషల్ మీడియా షేక్... అసలేం జరుగుతోంది?

ABN , First Publish Date - 2022-09-03T23:42:53+05:30 IST

ట్విట్టర్‌లో ఫిల్మ్ అప్డేట్స్ చూసే వాళ్లకి, తమ స్టార్ హీరో సినిమా అప్‌డేట్ కోసం సోషల్ మీడియాలోకి వచ్చే వాళ్లకి... ఈరోజు గట్టి షాక్ తగిలింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సినీ..

One Word: సోషల్ మీడియా షేక్... అసలేం జరుగుతోంది?

ట్విట్టర్‌లో ఫిల్మ్ అప్డేట్స్ చూసే వాళ్లకి, తమ స్టార్ హీరో సినిమా అప్‌డేట్ కోసం సోషల్ మీడియాలోకి వచ్చే వాళ్లకి... ఈరోజు గట్టి షాక్ తగిలింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సినీ అభిమానులంతా అయోమయంలోకి వెళ్ళిపోయారు. దీనికి కారణం... ‘సలార్, కెజియఫ్ 2’ మేకర్స్ వన్ వర్డ్ ట్రెండ్‌ (One Word Trend)ని క్రియేట్ చేయడమే. ‘కెజియఫ్ 2’ టీం నుంచి ‘మాన్‌స్టర్‌’ అనే one వర్డ్ ట్వీట్ బయటకి వచ్చింది... ఇది చూసి కెజియఫ్ 3 గురించి ఏమైనా అఫీషియల్ అప్‌డేట్ బయటకి వస్తుందేమో.. అని రాఖీ భాయ్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేశారు కానీ ఎలాంటి అప్‌డేట్ బయటకి రాలేదు. ఇది జరిగిన కాసేపటికి ‘సలార్’ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ‘వయోలెంట్’ అనే వర్డ్‌తో ఒక ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ చూసిన వాళ్లు, ప్రభాస్ మూవీ గురించి అప్‌డేట్ వస్తుందేమో అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు.


అదేంటి అసలు ఈ ‘మాన్‌స్టర్‌’, ‘వయోలెంట్’ ఇప్పుడు ఎందుకు వచ్చాయి అని మూవీ లవర్స్ అంతా డైలమాలో ఉండగా... ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రామ్ అండ్ భీమ్ అంటూ వన్ వర్డ్ ట్వీట్స్ వచ్చాయి. అప్పుడు కానీ అర్ధం కాలేదు, సోషల్ మీడియాలో వన్ వర్డ్ ట్రెండ్ స్టార్టయిందని. తమ సినిమా గురించి ఒక్క మాటలో చెప్తూ, మేకర్స్ ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేస్తున్నారు. కెజియఫ్ టీం స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతూ.. పుష్ప ది రైజ్ నుంచి ‘తగ్గేదే లే’ అని.. ‘పుష్ప - ది రైజ్‌’ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ‘ఫైర్‌’ అని పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి బింబిసార గురించి ‘జగత్‌ జజ్జరిక’ అని, ఎన్టీఆర్ గురించి ‘ఫియర్’ అని ట్వీట్స్‌ చేశారు. ఎన్టీఆర్ 30 ప్రొడ్యూసర్స్ యువసుధ క్రియేషన్స్ నుంచి ‘వస్తున్నా’ అంటూ వన్ వర్డ్ ట్వీట్ బయటకి వచ్చింది. గోపీచంద్ మలినేని NBK107 గురించి ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అని ట్వీట్ చేశాడు. ఇంకా ఈ ట్రెండ్‌లో ఎవరెవరు జాయిన్ అవుతారు? వాళ్ల సినిమా గురించి వన్ వర్డ్‌లో ఏం చెప్తారు అనేది చూడాలి. మొత్తానికి ఇలా వన్ వర్డ్ ట్రెండ్ దెబ్బకి, అసలు ఏం జరుగుతోందనే అయోమయంలోకి వెళ్లి, సదరు ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్స్‌ని కూడా కామెంట్స్‌తో ఒక ఆట ఆడేసుకోని... చివరికి విషయం తెలుసుకోని సైలెంట్ అయ్యారు.



Updated Date - 2022-09-03T23:42:53+05:30 IST