తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-11-20T13:48:18+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. నవంబర్ 19న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


గాడ్‌ఫాదర్ (Godfather)

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం 'గాడ్‌ఫాదర్'. మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం లూసిఫర్ కి ఇది రీమేక్. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్య దేవ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ బ్యానర్‌లపై ఆర్‌.బి.చౌదరి, ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించారు. అక్టోబర్ 5న విడుదలైన ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అధికార పార్టీకి చెందిన అత్యున్నత నాయకుడు, సీఎం చనిపోవడంతో ఆ రాష్ట్రంలో జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


గుంగా పెహల్వాన్ (Gunga Pehalwan)

'గుంగా పెహల్వాన్'.. అనేది పంజాబీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం.  నీరజ్ కాంత్, మల్కిత్ రౌనీ, అమృతపాల్ బిల్లా ప్రధాన సుఖ్ పాల్ సిద్ధూ, సంజీవ్ కలేర్, మంజు సేథి కీలక పాత్రల్లో నటించారు. కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని సుఖ్‌ పాల్ సిద్ధూ దర్శకత్వం వహించి నిర్మించారు. ఇటీవలే థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అదర్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


అదర్ (Other)

India's Sons - హిందీ

laal rang - హర్యాన్వీ


ఓహో గుజరాతీ (Oho Gujarati)

Bhamara - గుజరాతీ


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

The L Word: Generation Q Season 3 - ఇంగ్లిష్


ఎమ్‌ఎక్స్ ప్లేయర్ (MX Player)

Dharavi Bank - హిందీ





Updated Date - 2022-11-20T13:48:18+05:30 IST