తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-09-06T17:21:22+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. సెప్టెంబర్ 5న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


సాయన్న వర్తకల్ (Sayanna Varthakal)

డెన్నిస్ అనే జర్నలిస్ట్.. విజిల్‌బ్లోయర్ రవి కుమార్‌ను ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ సాగుతున్న కొద్దీ, పరిస్థితి కనిపించే దానికంటే చాలా క్లిష్టంగా ఉందని అర్థమవుతుంది. దాంతో వారి జీవితాలు ఎలా మారాయి అనేది ‘సాయన్న వర్తకల్’ కథాంశం. ఈ మలయాళీ బ్లాక్ కామెడీ క్రైమ్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి అరుణ్ చందు దర్శకత్వం వహించగా.. D14 ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఈ మూవీలో గోకుల్ సురేష్, నూతన నటి శరణ్య శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్లై, శంకర్ శర్మ అందించగా.. ఆగస్టు 5న 2022న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 5 నుంచి సన్‌నెక్ట్‌లో ప్రసారం అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Rick and Morty Season 6 - ఇంగ్లిష్

Once Upon a Small Town - కొరియన్

Updated Date - 2022-09-06T17:21:22+05:30 IST