తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-09-27T17:30:32+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. సెప్టెంబర్ 26న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


ది గోల్డెన్ స్పూన్ (The Golden Spoon)

ది గోల్డెన్ స్పూన్ అనేది సాంగ్ హ్యూన్ వూక్ దర్శకత్వం వహించిన దక్షిణ కొరియా టీవీ సిరీస్. ఇందులో యుక్ సంగ్ జే, లీ జోంగ్-వోన్, జంగ్ చే-యోన్, యోన్‌వూ నటించారు. 2016లో ప్రసారమైన టీవీ సిరీస్‌లో కొందరూ పిల్లలు చేసిన సాహసాన్ని వివరిస్తుంది. ఈ అడ్వెంచరస్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది.


ఫ్యామిలీ గై (Family Guy)

‘ఫ్యామిలీ గై’ అనేది అమెరికన్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్. 1999లో ప్రారంభమైన ఈ సిరీస్ ఇప్పటికే 20 సీజన్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం 21 సీజన్ విడుదలైంది. అన్ని సీజన్లలో కలిసి 400కు పైగా ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకుంది. తండ్రి పీటర్, తల్లి లోయిస్, కుమార్తె మెగ్, కుమారుడు క్రిస్, బేబీ స్టీవీ, కుటుంబ కుక్క బ్రియాన్ కలిసి క్వాహోగ్, రోడ్ ఐలాండ్‌లో నివసిస్తూ ఉంటారు. వారికి పని చేయడం నచ్చదు. చాలా బద్ధకస్తులు. వారి జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ సిరీస్. చిన్న పిల్లలతోపాటు పెద్ద వారు కూడా ఈ సిరీస్‌ని చాలా ఇష్టపడతారు. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది.


డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ (Disney Plus Hotstar)

Bob's Burgers Season 13 - ఇంగ్లిష్

The Great North Season 3 - ఇంగ్లిష్

The Simpsons Season 34 - ఇంగ్లిష్


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

My Little Pony: Make Your Mark Season 2 - ఇంగ్లిష్

A Trip to Infinity - ఇంగ్లిష్, జపనీస్


మూబీ (Mubi)

Another World - ఇంగ్లిష్, ఫ్రెంచ్





Updated Date - 2022-09-27T17:30:32+05:30 IST