VV Vinayak : శీనయ్య ఆగింది.. కొత్తది ఖాయం?

ABN , First Publish Date - 2022-06-12T16:03:18+05:30 IST

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా ఆ మధ్య.. ‘శీనయ్య’ అనే మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తన బ్యానర్ కు ‘దిల్’ తో తొలి హిట్ ఇచ్చిన కృతజ్ఞతతో వినాయక్ కు హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఆ సినిమాను నిర్మించాలనుకున్నారు. ఘనంగా చిత్రాన్ని ప్రారంభించారు.

VV Vinayak : శీనయ్య ఆగింది.. కొత్తది ఖాయం?

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ (VV Vinayak) హీరోగా ఆ మధ్య.. ‘శీనయ్య’  (Seenayya) అనే మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తన బ్యానర్ కు ‘దిల్’ (Dil) తో తొలి హిట్ ఇచ్చిన కృతజ్ఞతతో వినాయక్ ను హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు (Dil Raju) ఆ సినిమాను నిర్మించాలనుకున్నారు. ఘనంగా చిత్రాన్ని ప్రారంభించారు. అయితే అనుకోని విధంగా ప్రాజెక్ట్ కేన్సిల్ అయింది. కొత్త దర్శకుడు నరసింహారావు (Narasimharao) ఇచ్చిన ఫైనల్ నెరేషన్ నచ్చకపోవడంతో షూటింగ్ మొదలవకుండానే సినిమా ఆగిపోయింది. అలా వినాయక్ యాక్టింగ్ కెరీర్ కు మొదట్లోనే బ్రేక్ పడింది. ఆ తర్వాత వినాయక్ బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) తో ఛత్రపతి (Chatrapathi) హిందీ రీమేక్ చేసే పనిలో బిజీ అయిపోయారు.


అయితే ఇప్పుడు వినాయిక్ హీరోగా మరో సినిమా ఖాయమైందని సమాచారం. తాజాగా వినాయక్ కు కొత్త దర్శకుడు ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడట. అది వినాయక్ కు బాగా నచ్చడంతో డవలప్ చేయమని ఆ దర్శకుడికి చెప్పారట. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు కానీ.. సినిమా దాదాపు ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.  అన్నీ కుదిరితే దిల్ రాజే ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ వెర్షన్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగానే వినాయక్ హీరోగా తొలి చిత్రం ప్రారంభమవుతుందని వినికిడి. 


ఆల్రెడీ వినాయక్ .. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఠాగూర్’ (Thagore) చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గోపీ అనే ఆ పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా ఆ సినిమాతో వినాయక్ యాక్టింగ్ ట్రయల్ పూర్తయింది. ‘శీనయ్య’ చిత్రం ఆగిపోయినందుకు నిరాశ చెందిన వినాయక్.. ఈ సినిమాతో తన కల నెరవేర్చుకోనున్నారన్నమాట. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.  

Updated Date - 2022-06-12T16:03:18+05:30 IST