Blast Baby Item girl: ఈ కొత్త ఐటెం గర్ల్ టాలీవుడ్ ని ఊపుతోంది

ABN , First Publish Date - 2022-10-06T22:00:20+05:30 IST

టాలీవుడ్ (Tollywood) లో ఇప్పుడు ఒక కొత్త అమ్మాయి ఐటెం సాంగ్స్ (New girl in item songs) లో మెరుస్తోంది. అందరూ ఎవరు ఈ కొత్త ఐటెం గర్ల్ అని చర్చిస్తున్నారు.

Blast Baby Item girl: ఈ కొత్త ఐటెం గర్ల్ టాలీవుడ్ ని ఊపుతోంది

టాలీవుడ్ (Tollywood) లో ఇప్పుడు ఒక కొత్త అమ్మాయి ఐటెం సాంగ్స్ (New girl in item songs) లో మెరుస్తోంది. అందరూ ఎవరు ఈ కొత్త ఐటెం గర్ల్ అని చర్చిస్తున్నారు. నిన్న విడుదల అయినా 'గాడ్ ఫాదర్' (Godfather) సినిమాలో బ్లాస్ట్ బేబీ (Blast Baby Item Song) ఐటెం సాంగ్ వుంది కదా... అది బాగానే హిట్ అయింది.. ఆ పాటకి స్క్రీన్ మీద డాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా.. ఆమె ఎవరో కాదు, వారిన హుస్సేన్ (Warina Hussain). ఈమె ఇంతకు ముందు 'బింబి సార' (Bimbisara) సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ చేసింది. అది 'గులేబకావలి..... ' (Gulebakavali song from Bimbisara) అనే పాట. అది కూడా పెద్ద హిట్ అయింది. 


మళ్ళీ ఇప్పుడు ఈ 'గాడ్ ఫాదర్' సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఇంకా పెద్ద హిట్ అవ్వటం తో వారిన హుస్సేన్ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ఐటెం గర్ల్ గా కనపడుతోంది. బ్లాస్ట్ బేబీ సాంగ్ లో.... వారిన హుస్సేన్ చాలా గ్లామరస్ గా కనిపించటమే కాకుండా డాన్స్ స్టెప్స్ కూడా చాల బాగా చేసింది అని అంటున్నారు. ఇంకా ఆమె పని విషయానికి వస్తే, వారిన హుస్సేన్ 'దిల్ బిల్' అనే హిందీ కామెడీ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. ఈ సినిమాని 'తను వెడ్స్ మను' సినిమా నిర్మించిన వాళ్ళే నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-10-06T22:00:20+05:30 IST