రణ్‌బీర్ కపూర్ అనే నేను.. అలియా భట్ భర్తగా..

ABN , First Publish Date - 2022-04-19T16:36:20+05:30 IST

బాలీవుడ్ ప్రేమపావురాలు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే...

రణ్‌బీర్ కపూర్ అనే నేను.. అలియా భట్ భర్తగా..

బాలీవుడ్ ప్రేమపావురాలు రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం వారి మ్యారేజ్ గురించి అధికారికంగా అలియా సోషల్ మీడియాలో ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా మరికొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో తోడి పెళ్లికూతుళ్లతో రణ్‌బీర్ దిగిన ఫొటో నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంది.


గంగుభాయి కతియావాడి సినిమాలో నటించిన, అలియా స్నేహితురాలు తాన్యా సాహ గుప్తా తాజాగా రణ్‌బీర్‌తో పెళ్లి ఫొటోలని షేర్ చేసింది. అందులో.. పొలిటికల్ ప్రార్థన రీతిలో రణ్‌బీర్‌తో కొందరు అలియా ఫ్రెండ్స్ ప్లేడ్జ్ రాయించారు. అందులో.. ‘నేను రణ్‌బీర్.. అలియా భట్ భర్తగా.. తోడిపెళ్లికూతుళ్ల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు. 


అంతేకాకుండా, ఈ పిక్స్‌కి.. ‘ఇలా ఎంతో సంతోషంగా గడపడం ఆనందంగా ఉంది. నా స్నేహితురాలు అలియా ప్రేమ కథని ఎంజాయ్ చేస్తూ పంచుకున్న నవ్వులు, ఆనంద భాష్పాలు తిరిగి రావు. మా బంధం ఇప్పుడే ఇంకా గట్టిపడి, మా కుటుంబంలో మరికొంతమంది సభ్యుల వచ్చి చేరారు’ అంటూ తనదైన శైలిలో తాన్యా రాసుకొచ్చింది.



Updated Date - 2022-04-19T16:36:20+05:30 IST