సరికొత్తక్రైమ్‌ థ్రిల్లర్‌

ABN , First Publish Date - 2022-07-04T07:11:34+05:30 IST

సుధాకర్‌ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా న టిస్తున్న చిత్రం ‘అంఅః’. ‘ఎ డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌...

సరికొత్తక్రైమ్‌ థ్రిల్లర్‌

సుధాకర్‌ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా న టిస్తున్న చిత్రం ‘అంఅః’. ‘ఎ డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. శ్యామ్‌ మండల దర్శకత్వంలో జోరిగె శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌  విడుదల చేసి సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి తరం ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కించాం. సినిమాను త్వరలోనే విడుదల చేస్తాం. ‘అంఅః’ టైటిల్‌కు మంచి స్పందన వస్తోంద’న్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘యూనిట్‌ చాలా కష్టపడి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. జులై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ కుమార్‌ కంగుల. సినిమాటోగ్రఫీ: శివారెడ్డి సావనం. 


Updated Date - 2022-07-04T07:11:34+05:30 IST