Adipurush: సైఫ్ లుక్‌పై విమర్శలు.. క్రాస్ బ్రీడ్ అంటూ ట్రోలింగ్

ABN , First Publish Date - 2022-10-04T17:55:36+05:30 IST

దేశవ్యాప్తంగా ఎంతోమది సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు...

Adipurush: సైఫ్ లుక్‌పై విమర్శలు.. క్రాస్ బ్రీడ్ అంటూ ట్రోలింగ్

దేశవ్యాప్తంగా ఎంతోమది సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. రాముడిగా ప్రభాస్ (Prabhas), సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేసింది చిత్రబృందం. అయోధ్యలోని సరయు నది ఒడ్డున జరిగిన భారీ స్థాయిలో ఓ ఈవెంట్‌ని ఏర్పాటు చేసి మరి టీజర్‌ని విడుదల చేసింది మూవీ టీం. (Netizens trolls Saif Ali Khan look as Ravana)


ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఎంతోమంది ప్రభాస్ ఫ్యాన్స్ సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ టీజర్ నచ్చని మరి కొంతమంది నెటిజన్లు ప్రభాస్‌ని, ఓం రౌత్‌ని, మూవీ మేకర్స్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభాస్ లుక్కు దగ్గర నుంచి మూవీలో యానిమేషన్ వరకూ అన్నింటిపైన ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా.. ఇందులో రావణుడిగా సైఫ్ అలీఖాన్ లుక్‌ మీదైతే విపరీతమైన విమర్శలు చేశారు.


అందులో.. ఓ నెటిజన్ అయితే బ్రిటీష్ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ షోతో పొల్చారు. అందులో.. రావణుడు ఓ రాక్షస పక్షి మీద వస్తున్న పిక్‌ని షేర్ చేసి.. ‘ఏంటి రావణుడు కూడా టార్గెరీయన్ హా’ అంటూ వెటకారంగా రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై పలువురు స్పందిస్తూ.. ‘అవును వాళ్లకి చాలా ఏళ్ల ముందు తరం వాడు’, ‘రావణుడి కళ్లు వైట్‌వాకర్‌లా ఉన్నాయి’, ‘అది వైకింగ్‌కి టార్గెరీయన్‌కి పుట్టిన క్రాస్ బ్రీడ్.. లైగర్’ అంటూ విచిత్రమైన కామెంట్స్ చేశారు. మరి కొందరైతే ‘రావణుడు ఏటి తైమూర్‌లా ఉన్నాడు’, ‘రావణుడిని మొగల్‌గా మార్చేశారు’ అంటూ ట్వీట్స్ చేశారు.







Updated Date - 2022-10-04T17:55:36+05:30 IST