Malaika Aroraని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ నటి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-05-02T17:11:54+05:30 IST

బాలీవుడ్‌లోని స్టైలిష్ నటీమణుల్లో మలైకా అరోరా ఒకరు. ఈ బ్యూటీ ఫ్యాషన్ సెన్స్‌కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు...

Malaika Aroraని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఇంతకీ నటి ఏం చేసిందంటే..

బాలీవుడ్‌లోని స్టైలిష్ నటీమణుల్లో మలైకా అరోరా ఒకరు. ఈ బ్యూటీ ఫ్యాషన్ సెన్స్‌కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ భామ కొత్తగా ఏ పిక్ షేర్ చేసిన కొద్దిసమయంలోనే వైరల్‌గా మారుతుంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఈ తార ఫ్యాషన్ డిజాస్టర్‌ అయ్యి ట్రోలింగ్‌కి సైతం గురవుతూ ఉంటుంది. తాజాగా సైతం మలైకా ఓ విషయంలో విపరీతంగా ట్రోలింగ్‌కి గురయ్యింది.


మలైకాకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో గ్రీన్ అవుట్‌ఫిట్‌లో ఎంతో అందంగా ఉన్న మలైక తన కారులోంచి దిగి ఓ ఆఫీసులోకి వెళ్లింది. అలాగే కొద్దిసేపటికి తిరిగి వచ్చింది. అయితే ఇక్కడ అందరిని దృష్టిని ఆకర్షించింది ఆమె డ్రెస్సింగ్ కాదు.. ఆమె నడక. అది కొంచెం విచిత్రంగా అందరికీ అనిపించింది. వెనుక వైపు పాదాలు నెలకి ఆనకుండా వేళ్లమీద మాత్రమే నడుస్తూ వచ్చింది. ఇది గమనించిన ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ‘ఆమెకి ఏమైంది’, ‘అలా ఎందుకు నడుస్తోంది’, ‘ఆమె నడక కొంచెం తేడాగా ఉందంటూ’ ట్రోలింగ్ చేస్తున్నారు.



Updated Date - 2022-05-02T17:11:54+05:30 IST