Bigg Boss: సిగ్గు సిగ్గు.. మహిళలను లైంగికంగా వేధించినవాడికి సపోర్టు చేస్తారా..

ABN , First Publish Date - 2022-10-04T16:42:39+05:30 IST

బిగ్‌బాస్ (Bigg Boss).. దేశవ్యాప్తంగా ఈ షోకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట బాలీవుడ్‌లో మొదలైన ఈ షోని అనంతరం..

Bigg Boss: సిగ్గు సిగ్గు.. మహిళలను లైంగికంగా వేధించినవాడికి సపోర్టు చేస్తారా..

బిగ్‌బాస్ (Bigg Boss).. దేశవ్యాప్తంగా ఈ షోకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట బాలీవుడ్‌లో మొదలైన ఈ షోని అనంతరం అన్ని ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చారు. అయితే.. హిందీలో ఇప్పటికే పదిహేను సీజన్లను పూర్తి విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో పదహారో సీజన్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్‌గా వ్యవహారిస్తున్న తాజా షోకి కంటెస్టెంట్‌లుగా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. అందులో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid khan) కూడా ఉన్నారు.


‘హిమ్మత్ వాలా’, ‘హౌస్ ఫుల్’ సిరీస్ వంటి పలు సినిమాల దర్శకుడిగా సాజిద్ ఖాన్‌కి బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉంది. అయితే.. గతంలోనే ఈ దర్శకుడిపై లైంగిక వేధింపుల (harassment) ఆరోపణలు ఉన్నాయి. పలువురు మహిళలు ఆయనపై సోషల్ మీడియా వేదికగా లైంగిక ఆరోపణలు చేశారు. ఈ తరుణంలోనే ఈ దర్శకుడు బిగ్‌బాస్ 16కి కంటెస్టెంట్‌ (Contestant)గా వచ్చాడు. దీంతో.. ఇలాంటి ఉమనైజర్‌కి సపోర్టు చేస్తారా అంటూ సోషల్ మీడియా యూజర్ ఒకరు ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. అందులో.. సాజిద్ వల్ల లైంగిక వేధింపులకి గురైన తొమ్మిది మంది మహిళల పిక్స్‌ని అందులో ఆ పోస్టులో షేర్ చేసింది.


ఆ పోస్టుకి.. ‘సాజిద్‌ఖాన్‌పై 9 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని నాకు తెలుసు. వారి వివరాలు నాకు ఈ రోజు తెలిశాయి. ఉమనైజర్ అయిన అలాంటి ఓ వ్యక్తికి సపోర్ట్ చేయడం సిగ్గుచేటు. అది ఎవరైనా సరే. Bigg Boss 16, Colors TV సిగ్గు పడాల్సిన విషయం’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా.. ఆ 9 మంది పిక్స్‌తో పాటు వారి నేపథ్యాన్ని కూడా షేర్ చేసింది.



Updated Date - 2022-10-04T16:42:39+05:30 IST