శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై Jacqueline Fernandez పోస్ట్.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-04-06T18:23:38+05:30 IST

శ్రీలంక మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, మెడిసిన్స్ కొరతతో....

శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై Jacqueline Fernandez పోస్ట్.. ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు

శ్రీలంక మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, మెడిసిన్స్ కొరతతో దేశ ప్రజలందరూ విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. రోజులో ఎక్కువ సమయం విద్యుత్ కోత  ఉంటోంది. ఆఖరికి ఇంకు, పేపర్ లేక అక్కడి ప్రభుత్వం పరీక్షలు సైతం రద్దు చేసింది. ఈ సంక్షోభంపై శ్రీలంకకి చెందిన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.


అందులో జాక్వెలిన్.. ‘ఓ శ్రీలంకన్‌గా, నా దేశం, నా ప్రజలు కష్టాలు చూస్తుంటే హృదయం తట్టుకోలేకపోతోంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలను వింటున్నాను. నేను చెప్పేదేమిటంటే.. కళ్లకు కనిపించే దాన్ని చూసి వెంటనే ఓ నిర్ణయానికి రాకండి. తొందరపడి విమర్శలు చేయకండి. నా ప్రజలకు ఇతరుల జడ్జిమెంట్ అవసరం లేదు. ఈ సమయంలో వారికి కావాల్సింది మీ నుంచి సానుభూతి, మద్దతు మాత్రమే. సరిగ్గా తెలియని విషయంపై మీరు చేసే కామెంట్స్ కంటే.. వారి కష్టం గురించి మీరు చేసే 2 నిమిషాల నిశ్శబ్ద ప్రార్థన ఎంతో బలాన్ని చేకూర్చడమే కాకుండా మిమ్మల్ని వారికి దగ్గర చేస్తుంది.


నా దేశం, నా ప్రజలు.. ఈ పరిస్థితి నుంచి త్వరలోనే బయటపడతారని ఆశిస్తున్నా. బయటపడాలని కోరుకుంటున్నా. ఈ పరిస్థితిని ఎదరుర్కొనే బలం చేకూరలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కొందరు ఫ్యాన్స్ ఈ భామకి సపోర్టుగా కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు. 


‘శ్రీలంకలో ఉండడం ద్వారా శ్రీలంకకు మద్దతు ఇవ్వండి. అక్కడే ఉండి మీ మనీని, మీ వనరులను వారికి ఉపయోగించండి. అప్పుడే మంచి జరగుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘2 నిమిషాల ప్రార్థనలకు బదులుగా మీ దేశం కోసం ఏదైనా విరాళం ఇవ్వండి’ అని మరో నెటిజన్.. ‘ఎటువంటి సహాయం చేయకుండా కేవలం పోస్ట్ మాత్రమే చేయడం వల్ల ఉపయోగం ఏంటి.. నేను కూడా ఇలాంటి పోస్టులు చేయగలను’ అంటూ ఇంకో నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు.



Updated Date - 2022-04-06T18:23:38+05:30 IST