పంచాంగంతోనే ఇస్రో మార్స్ మిషన్ విజయవంతమయిందన్న R Madhavan.. ట్రోల్స్‌పై స్పందించిన హీరో..

ABN , First Publish Date - 2022-06-26T23:43:42+05:30 IST

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R Madhavan). ‘సఖి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’

పంచాంగంతోనే ఇస్రో మార్స్ మిషన్ విజయవంతమయిందన్న R Madhavan.. ట్రోల్స్‌పై స్పందించిన హీరో..

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R Madhavan). ‘సఖి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’ వంటి హిట్ చిత్రాలతో అభిమానులను అలరించారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect). నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇస్రోలో గూఢచార్యనికి పాల్పడ్డారనే తప్పుడు ఆరోపణలను ఆయనపై మోపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మాధవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. పలు భాషల్లో రూపొందించారు. జులై 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాధవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.   


ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్‌కు పంచాంగం తోడ్పడిందని ఆర్. మాధవన్ తెలిపారు. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతోనే భారత్ మార్స్ మిషన్ అనేక అడ్డంకులను అధిగమించగలిగిందని చెప్పారు. ఆర్. మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్స్ ఆయనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘‘సైన్స్ గురించి తెలియకపోవడం తప్పేమీ కాదు. కానీ, పనులు ఏలా జరుగుతాయో తెలియకపోతే నోరు మూసుకుని ఉండాలి’’ అని ఓ నెటిజన్ తెలిపారు. ‘‘మాధవన్ అధికారికంగా చాక్లెట్ భాయ్ నుంచి వాట్సప్ అంకుల్‌గా మారారు’’ అని మరో నెటిజన్ చెప్పారు. ‘‘మాధవన్ చెత్త వాగుడు కట్టిపెడితేనె క్యూట్‌గా ఉంటారు’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ వెల్లడించారు. తనపై నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేయడంతో మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నాకి శాస్తి జరగాల్సిందే. ఇయర్ బుక్‌ను తప్పుగా తమిళ్‌లో పంచాంగం అని చెప్పాను. నా అజ్ఞానంతో ఆ మాటలను అన్నాను. మార్స్ మిషన్‌ను మనం రెండు ఇంజిన్స్‌తో విజయవంతం చేశాం. నా మాటలు ఈ విజయాన్ని ఏ మాత్రం తక్కువ చేయలేవు. ఆ మిషన్ ఇప్పటికీ రికార్డే. వికాస్ ఇంజిన్ రాక్‌స్టార్’’ అని ఆర్. మాధవన్ పోస్ట్ పెట్టారు. 





Updated Date - 2022-06-26T23:43:42+05:30 IST