డిఫరెంట్ లుక్‌లో దీపికా, రణ్‌వీర్ దంపతులు.. కత్రీనా, విక్కీని చూసి జెలసీ ఫీల్ అవుతున్నారంటూ..

ABN , First Publish Date - 2021-12-16T21:32:36+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న జంటల్లో అందాల తార దీపికా పదుకొనే, యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి...

డిఫరెంట్ లుక్‌లో దీపికా, రణ్‌వీర్ దంపతులు.. కత్రీనా, విక్కీని చూసి జెలసీ ఫీల్ అవుతున్నారంటూ..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న జంటల్లో అందాల తార దీపికా పదుకొనే, యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ జంట ఒకటి. ‘గాలియాన్ కే రాస్‌లీలా రామ్‌లీలా’ సినిమాలో కలిసి నటించిన ఈ కపుల్ అనంతరం ప్రేమ పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ జంటగా మారిపోయారు. నటనతోనే కాకుండా తమ ఫ్యాషన్ సెన్స్‌తోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ స్టార్ దంపతులు.


అయితే తాజాగా ఈ రణ్‌వీర్, దీపికా కలిసి ఓ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో.. కారులో ఎయిర్‌పోర్టుకి వచ్చింది ఈ జంట. ముందుగా కిందకి దిగిన రణ్‌వీర్ డోర్ తీయగా దీపికా దిగింది. అనంతరం మీడియా కోసం ఫోటోలకి ఫోజులిచ్చారు. అయితే ఈ యంగ్ హీరో ఎల్లో కలసి టైగర్ టీ షర్టు, రెడ్ కలర్ ప్యాంటు వేసుకోగా.. ఈ హట్ బ్యూటీ మాత్రం టాప్ టు బాటమ్ వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంది. మీడియాని ఉద్దేశించి రణ్‌వీర్ మాట్లాడుతూ.. దీపికా నా ‘83’ ప్రొడ్యూసర్ అని చెబుతూ ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఈ వైరల్‌ వీడియోపై ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు.


‘ఒకరి డ్రెస్సులు మరొకరు వేసుకొచ్చారనుకుంటా’ అంటూ కొందరు.. ‘వీళ్ల వేషాలు చూస్తుంటే చిరాకు వేస్తోంద’ని ఇంకొందరు.. ‘జోకర్స్‌లా ఉన్నారం’టూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఇంకొదరైతే నూతన దంపతులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ని చూసి జెలసీగా ఫీల్ అవుతున్నారని, అందుకే వారి నుంచి మీడియా, ప్రేక్షకుల దృష్టిని తమవైపుకి తిప్పుకోవడానికి ఇలా చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కాగా ఈ జంట ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్‌గా వస్తున్న ‘83’ మూవీలో కలిసి నటిస్తున్నారు.



Updated Date - 2021-12-16T21:32:36+05:30 IST