Adipurush teaser reaction: ఇది సినిమానా.. యానిమేషనా.. ప్రభాస్ మూవీ టీంని ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-10-03T15:18:28+05:30 IST

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఆదిపురుష్’ (Adipurush). భారత ఇతిహాసం రామాయణం ఆధారం తెరకెక్కిన..

Adipurush teaser reaction: ఇది సినిమానా.. యానిమేషనా.. ప్రభాస్ మూవీ టీంని ఆడేసుకుంటున్న నెటిజన్లు

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఆదిపురుష్’ (Adipurush). భారత ఇతిహాసం రామాయణం ఆధారం తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రాముడిగా ప్రభాస్ (Prabhas), సీతగా కృతి సనన్(Kriti Sanon), రావణుడిగా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటించారు. ఓం రౌత్ (Om Raut) ఈ సినిమాకి దర్శకుడు. ఈ తరుణంలో ఇటీవలే ఈ మూవీలో రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఆ లుక్ చూసిన కొందరు ప్రశంసలు కురింపించగా.. మరికొందరూ దాని కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ బావున్నాయంటూ కామెంట్స్ చేశారు.


ఈ తరుణంలోనే అక్టోబర్ 2న ‘ఆదిపురుష్’ టీజర్ మూవీ టీం విడుదల చేసింది. అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఓ ఈవెంట్‌ని ఏర్పాటు చేసి మరి టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే దాదాపు మిలియన్ల వ్యూస్ సాధించింది. అది చాలామందికి నచ్చింది. అయితే.. ఎప్పటిలాగే మరికొద్దిమందికి నచ్చలేదు. అందుకే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. 


ఈ టీజర్ లైవ్ యాక్షన్ మూవీలా కాకుండా.. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ లాగా నాసిరకంగా వీఎఫ్‌ఎక్స్ చేశారని విమర్శలు చేస్తున్నారు. ఈ ట్రైలర్‌ ఫ్యాన్స్ చేసే వాటిలాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు.. ‘ఆదిపురుష్ టీజర్‌ని చాలాసార్లు చూసిన తర్వాత నాకు ఓ విషయం అర్థమైంది. ఈ మూవీ అయితే.. భారతదేశంలోని అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది. లేకపోతే దారుణమైన ఫ్లాప్‌గా మిగిలిపోతుంది. నాకు వ్యక్తిగతంగా ప్రభాస్ లుక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్ర్కీన్‌ప్లే బాగా నచ్చింది’ అని రాసుకొచ్చాడు. కొందరైతే ‘టెంపుల్ రన్’ గేమ్‌తో పోల్చుతూ.. ‘టెంపుల్ రన్ 4’ ఉందంటూ కామెంట్స్ చేశారు.











Updated Date - 2022-10-03T15:18:28+05:30 IST